విమానంలో కాళ్ళు అక్కడ పెట్టి వెకిలి చేష్టలు, ఇచ్చి పడేసిన అర్జున్ రెడ్డి నటి.. ఎముకలు విరిగేలా..

తెలుగు నటి శ్రీ సుధ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. చాలా సందర్భాల్లో నటీమణులకు కొందరి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి.

Arjun Reddy Actress Sri Sudha gets bad experience in flight dtr

తెలుగు నటి శ్రీ సుధ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. చాలా సందర్భాల్లో నటీమణులకు కొందరి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. శ్రీ సుధకి ఏకంగా తాను ప్రయాణిస్తున్న విమానంలో ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఎంత చెప్పినా వినకుండా తన వక్ర బుద్ది ప్రదర్శిస్తూనే ఉన్నాడట. 

అయితే శ్రీసుధ చూస్తూ ఊరుకోలేదు. ఎలా బుద్ది చెప్పాలో ఆ విధంగా ఇచ్చి పడేసింది. అసలేం జరిగిందంటే.. శ్రీసుధ విమానంలో ప్రయత్నిస్తుండగా.. ఆమె వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ కాళ్ళని ఆమెకి తాకేలా కావాలనే ముందుకు పెట్టాడు. పలు మార్లు ఇలా చేయడంతో ఆమె హెచ్చరించింది. సిబ్బందికి కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతడి ప్రవర్తన మారలేదు. 

దీనితో గట్టిగా ఒక్కటి ఇచ్చిందట. బలంగా దెబ్బ కొట్టిందట. ఈ విషయాన్ని శ్రీసుధ ఇంస్టాగ్రామ్ల్ అభిమానులతో పంచుకుంది. అతడి ఎముకలు విరిగి ఉంటే నాకు సంబంధం లేదు అని కామెంట్ పెట్టింది. అతడు తన కాళ్ళని ముందుకు చాపి ఉంచిన ఫోటో కూడా షేర్ చేసింది. నటి శ్రీసుధ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీనితో కొందరు శ్రీసుధ చేసిన పనిని అభినందిస్తున్నారు. మరికొందరు చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం ఎందుకు.. కొట్టకుండా అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది అని అంటున్నారు. దీనికి శ్రీసుధ సమాధానం ఇస్తూ.. ఆ మాత్రం నాకు కూడా తెలుసు. పలుమార్లు చెప్పి చూశాను. కానీ విసిగిస్తూనే ఉంటే ఏం చేయాలి అని సమాధానం ఇచ్చింది.

గతంలో కూడా శ్రీసుధకి సంబంధించిన ఓ వివాదం వార్తల్లో నిలిచింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో శ్యామ్ కె నాయిడు మనుషులు తనని బెదిరించినట్లు కూడా శ్రీసుధ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. 

శ్రీసుధ అర్జున్ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, వలయం, క్రష్ , రూలర్ లాంటి చిత్రాల్లో నటించింది. కొన్ని బోల్డ్ పాత్రల్లో కూడా శ్రీ సుధ నటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios