టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. ఈ నెలాఖరున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. మరోపక్క హీరోయిన్ శ్రద్ధాకపూర్ సినిమాలో తనకు సంబంధించిన స్టిల్స్ ని ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.

ఈ క్రమంలో 'సాహో' సినిమాలోని తొలిపాటకు సంబంధించిన ఓ స్టిల్ ని శ్రద్ధా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. రెడ్ కలర్ ఫ్రాక్ లో, మంచు కొండల్లో, కాళ్ల దగ్గర పొగలు వస్తున్నట్లుగా ఆ ఫోటోని తీశారు. అయితే ఆ ఫోటో చూసిన అర్జున్ 'గట్టిగా తుమ్మినట్లు ఆ రియాక్షన్ ఏంటి..?' అని చమత్కరించాడు.

ఈ కామెంట్ కి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. దాదాపు మూడువేలకు పైగా లైకులు ఈ కామెంట్ కి రావడం విశేషం. శ్రద్ధా, అర్జున్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఆ చనువుతోనే ఆమె ఫోటోపై కామెంట్ చేశాడు.

సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న 'సాహో'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ ని ఆగస్ట్ 10న విడుదల చేయనున్నారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.