బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. సోషల్‌ మీడియాలో ఇదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. బిగ్‌బాస్‌ సీజన్‌2, సీజన్‌ 3 విన్నర్‌ కౌశల్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. విజయ్‌ దేవరకొండ కూడా తన ఓటు అభిజీత్‌కే అన్నాడు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోతున్నాయి. అభిజిత్‌కి భారీ షాక్‌ ఇవ్వబోతుందట అరియానా. ఈ సారి ఊహించని విధంగా బిగ్‌బాస్‌ టైటిల్‌ని అరియానా కొట్టేయబోతుందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 విన్నర్‌ ఎవరు అనే దానిపై సోషల్‌ మీడియాలో పలు సంస్థలు పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు అభిజిత్‌ యాభై శాతం ఓట్లతో టాప్‌ లో ఉండగా, తాజాగా అభిజిత్‌ కూడా అరియానా కొట్టేసింది. ఇటీవల ఆమె ఆట తీరు, మహిళలు టైటిల్స్ విన్నర్‌ కాదు అనే చర్చ వినిపించిన నేపథ్యంలో ఆడియెన్స్ ఆరియానాకి ఓట్ల వర్షం కురిపించారు. అంతేకాదు టైటిల్‌ విన్నర్ అయితే వచ్చే యాభై లక్షలతో ఏం చేస్తారని బిగ్‌బాస్‌ ప్రశ్నించగా, అరియానా ఐదు లక్షలు రైతుల కోసం కేటాయిస్తానని తెలిపింది.  మరోవైపు హౌజ్‌లో గేమ్స్ ఆడటంలో అరియానా ముందుంటుంది. ఇవన్నీ అరియానాపై అందరిలోనూ పాజిటివ్‌ ఒపీనియన్‌ కలిగించేలా చేసింది. దీంతో అభిజిత్‌ కూడా దాటేసింది అరియానా. ప్రస్తుతం నెంబర్‌ వన్‌గా కొనసాగుతుంది. 

పోల్స్ ఇలా ఉన్నప్పుడు బిగ్‌బాస్‌లో ఓటింగ్స్ కూడా ఇలానే ఉండే ఛాన్స్ ఉందని, ఇదే నిజమైతే, అబిజిత్‌కి, ఆయన అభిమానులకు మైండ్‌ బ్లాంక్‌ కావడం ఖాయమంటున్నారు నెటిజన్లు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక తుఫానులా దూసుకొచ్చిన సోహైల్‌ మూడో స్థానంలో, అఖిల్‌ నాల్గో స్థానంలో, హారిక ఐదో స్థానంలో నిలవనున్నారట. మరి విన్నర్‌ ఎవరు అనేది తేలేందుకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది.