పదో వారం నామినేషన్‌ ప్రక్రియలో సభ్యులంతా అరియానాని టార్గెట్‌ చేసినట్టు కనిపించింది. ఈ వారం ఆమెని ఏడుగురు నామినేట్‌ చేశారు. మోనాల్‌, సోహైల్‌, లాస్య, అఖిల్‌, అభిజిత్‌, హారిక, మెహబూబ్‌ వరుసగా అరియానాని నామినేట్‌ చేశారు.

అందరు అరియానా కెప్టెన్సీలో, టాస్క్‌లో తను ప్రవర్తించిన విధానంపైనే కామెంట్‌ చేశారు. టాస్క్ ల్లో ఓవర్‌గా ఆడుతుందని విమర్శించారు. అరియాని నామినేట్‌ చేసిన మెహబూబ్‌ స్పందిస్తూ, తాను కెప్టెన్‌గా ఉన్నప్పడు ఈక్వల్‌గా చూడలేదని, తనకు ఎక్కువ పని ఇచ్చిందన్నారు. హారిక నామినేట్‌ చేస్తూ, గత వారం ముఖం దాచుకునే టాస్క్ లో తనకు ఇబ్బంది ఉందని చెప్పినా, అరియానా నీళ్ళు చల్లిందని చెప్పింది. 

అఖిల్‌.. నామినేట్‌ చేస్తూ అరియానా `పల్లెకు పోదాం ఛలో ఛలో` టాస్క్ లో గడసరి అమ్మాయిగా అరియానా కనిపించలేదన్నారు. సోహైల్‌ నామినేట్‌ చేస్తూ, మాట్లాడే విధానం మార్చుకోవాలని, అది ఓవర్‌గా ఉందని చెప్పాడు. అభిజిత్‌ నామినేట్‌ చేస్తూ, టాస్క్ లో కొన్ని గెలవాలి, కొన్ని ఓడిపోవాలి, కానీ తాను సరిగ్గా ఆడటం లేదన్నారు. అతిగా ఫీలై ఆడుతుందని విమర్శించాడు. 

లాస్య నామినేట్‌ చేస్తూ, ఫ్లేట్‌ విషయాల్లో, కిచెన్‌ విషయాల్లో అరియానాపై విమర్శలు చేసింది. మోనాల్‌ నామినేట్‌ చేస్తూ గేమ్‌లో నన్ను టార్గెట్‌ చేసిందని ఆరోపించింది. అరియానా.. మోనాల్‌, సోహైల్‌ని నామినేట్‌ చేయగా, సోహైల్‌గా బరాబర్‌ వాధించింది. ఇద్దరం తగ్గాలని ఒప్పుకున్నారు. ప్రామిస్‌ చేసుకున్నారు. ఇక మోనాల్‌ ఆట, ఆమె ప్రవర్తన అంతా ఫేక్‌ అని విమర్శించింది అరియానా. 

ఈ వారంలో ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో అరియానా, మెహబూబ్‌, మోనాల్‌, హారిక, అభిజిత్‌, సోహైల్‌ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యిన తర్వాత అరియానా చాలా బాధపడింది. హౌజ్‌లో అందరు తనకి నెగటివ్‌గా మారిపోయారని, ఇంట్లో ఉండాలని లేదని అవినాష్‌ ముందు వాపోయింది. వాళ్ళంగా గ్యాంగ్‌గా ఏర్పడ్డారని ఆరోపించింది. 

ఇక తనని నామినేట్‌ చేయడంపై అఖిల్‌ని ప్రశ్నించాడు అభిజిత్‌. ముఖం దాచుకునే టాస్క్ లో మధ్యలో వెళ్ళిపోవడం తన నిర్ణయమని, దాన్ని ఉద్దేశించి ఎలా నామినేట్‌ చేస్తావని ప్రశ్నించాడు. అందుకు అభిజిత్‌కి ఛాక్లెట్‌ ఇచ్చాడు అఖిల్‌. కానీ అభిజిత్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు.