ఆదివారం ఎపిసోడ్‌లో అరియానా అందరి మనసులు గెలుచుకుంది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె హౌజ్‌లో నిజంగానే అంతే బోల్డ్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంది. ఎట్టకేలకు ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో అరియానా ఫైనలిస్ట్ గా ఎంపికైంది. అయితే ఆదివారం ఎపిసోడ్‌ ప్రారంభంలో బిగ్‌బాస్‌ విన్నర్‌కి యాభై లక్షల ప్రైజ్‌మనీ వస్తుందని, అయితే ఆ వచ్చిన డబ్బుని ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలన్నారు నాగ్‌. 

అందుకు అందరు ఇళ్లు కొనుక్కుంటామన్నారు. అరియానా చెప్పినది మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఆమె తనకు వచ్చిన ప్రైజ్‌ మనీతో ఇళ్లు కట్టుకుంటానని చెప్పింది. అయితే ఓ ఐదు లక్షలు మాత్రం రైతులకు విరాళంగా అందిస్తానని చెప్పింది. తమ ఊరు అంతారంలోని పొలం కొనుకున్న ఓ ఐదారు మంది రైతులకు తలా యాభై వేల చొప్పున సహాయం అందిస్తానని చెప్పింది. 

దీంతో నాగార్జునతోపాటు ఇంటిసభ్యులు కూడా వాహ్‌ అన్నారు. ఆమెని మెచ్చుకున్నారు. అలాగే అఖిల్‌ కూడా ఓ ఓల్డేజ్‌ హోమ్‌ ఎన్జీవో పెడతానని చెప్పాడు. సోహైల్‌ మాత్రం పది లక్షలు సహాయం కోసం పక్కన పెడతానని, తన ఫ్రెండ్‌ విషయంలో జరిగిన సంఘటన చెప్పాడు. మిగిలినది ఇళ్లు కొనుక్కుంటానని తెలిపాడు.