బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 50వ రోజు ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియా వేడివేడిగా జరిగింది. ఒకరిపై ఒకరి ఆరోపణలతో రసవత్తరంగా సాగింది. ఇందులో ఓ వైపు అఖిల్‌, అమ్మా రాజశేఖర్‌ గొడవపడితే.. అరియానా సైతం ఫైర్‌ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఆమె మండిపడింది. మెహబూబ్‌.. అరియానాని నామినేట్‌ చేశాడు. తమ మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయని, వాటిని క్లీయర్ చేసుకుందామన్నాడు. 

ఇక తన వంతు వచ్చినప్పుడు అరియానా గట్టిగా రియాక్ట్ అయ్యింది. క్లియర్‌ చేసుకోవాలని చెప్పి ఇంటి నుంచి పంపిస్తారా? ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలనిగానీ, నామినేట్‌ చేసి ఇంటినుంచి పంపించేందుకు నామినేట్‌ చేయడమేంటని మండిపడింది. ఫస్ట్ టైమ్‌ ఫైర్‌ అయ్యింది. 

ఇక సోహైల్‌ వంతు వచ్చినప్పుడు అరియానాని నామినేట్‌చేశారు. మెహబూబ్‌ విషయంలోనే అరియానా చేసినదానికి తనని నామినేట్‌ చేస్తున్నానని తెలిపారు. దీంతో అరియానా చాలా సీరియెస్‌గా ఉంది. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అలా ఉండిపోయింది. ఆమెని చూసి సోహైల్‌ భయపడ్డారు. కాసేపు హంగామా చేశాడు. అరియానా ముఖం చూసి వణికిపోయినంత పనిచేశాడు.