ఇవాళ బిగ్ బాస్ ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ఇంటి సభ్యులు ముందుగానే గమనించారు. దానికి ఆరియనా బిగ్ బాస్ నన్ను మోసం చేశాడని, నాకు వచ్చిన లెటర్ చించి పంపిన బిగ్ బాస్, నన్ను పేరెంట్స్ తో కూడా కలవనీయడని అఖిల్ తో చెప్పింది. 

నిజానికి బిగ్ బాస్ ఇంటి సబ్యులకు,  కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెటర్స్ ని అవినాష్, ఆరియానాకు రాకుండా చేసింది అఖిల్. సీక్రెట్ హౌస్ లో ఉన్న అఖిల్, అవినాష్, ఆరియనా చెప్పిన వాటిని సీక్రెట్స్ గా కన్సిడర్ చేయకుండా, వారిద్దరి లెటర్స్ మాత్రమే చింపి వేశాడు. మిగతా వాళ్ళు కూడా సిల్లీ సీక్రెట్స్ చెప్పినా, హౌస్ లో వేరుగా, ఒక టీం గా ఉంటున్న ఆరియానా, అవినాష్ లకు అఖిల్ అన్యాయం చేశాడు. 

ఈ విషయం తెలియని ఆరియనా  తన లెటర్ బిగ్ బాస్ చించి  ఇచ్చాడని అతనితోనే చెప్పుకుంది. మరి అప్పటికైనా అఖిల్ ఆ లెటర్ చించి ఇచ్చింది నేనే అన్న విషయం చెప్పలేదు. ఆ నేరాన్ని బిగ్ బాస్ పైనే వేసి , ఆరియానా ఆరోపణలు ఎంజాయ్ చేశాడు అఖిల్.  మరి గేమ్ జెన్యూన్ గా ఆడుతున్నాడని చెప్పుకునే అఖిల్ ఆరియానాకు నిజం చెప్పలేదు.