త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అరవింద సమేత మొత్తానికి 150 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇటీవల విడుదలైన క్లోజింగ్ లెక్కల ప్రకారం తారక్ కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇక ఇండస్ట్రీలో టాప్ 10 లో  అత్యధిక షేర్స్ అందుకున్న అరవింద 6వ స్థానంలో నిలిచింది.  

పలు ప్రముఖ వెబ్ సైట్ల అంచనాల ప్రకారం సినిమా 88 నుంచి 95 కోట్ల షేర్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఓపెనింగ్స్ ను బట్టి ఫైనల్ గా షేర్స్ కలెక్షన్స్ లలో సెంచరీ కొట్టేస్తుందని అనుకున్నారు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ గ్రాస్ రూపంలో 150 కోట్ల మార్క్ ను  క్రాస్ చేయడంతో బయ్యర్స్ దాదాపు సేఫ్ జోన్ లోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 70 కోట్లకు పైగా షేర్స్ ను రాబట్టింది. 

మొత్తంగా వరల్డ్ వైడ్ గా 91కోట్ల ధర పలికిన అరవింద సమేత 95 కోట్ల షేర్స్ ను  కలెక్ట్ చేసిందని సమాచారం. నైజం ఏరియాల్లో తప్పితే మిగతా ఏరియాల్లో చాలా వరకు బయ్యర్స్ పెద్దగా లాభాలను అందుకోలేదని తెలుస్తోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను హారికా హాసిని ప్రొడక్షన్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.