టాలీవుడ్ సెలబ్రిటీలు షూటింగ్ కోసం, ట్రిప్ ల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన స్పెయిన్ లో ఓ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఓ విల్లా కొనాలని చూస్తున్నాడట.

దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన లేనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ విల్లాకి సంబంధించిన డీల్ కూడా ఫైనల్ చేశాడని టాక్. గతంలో ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా షూటింగ్ కూడా స్పెయిన్ లో నిర్వహించారు.

ఇప్పుడు అక్కడే ఓ విల్లా తీసుకోబోతున్నాడట తారక్. తన కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడానికి సొంతగా అక్కడ విల్లా తీసుకోవాలని భావిస్తున్నారట. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి కొంటున్నట్లు తెలుస్తోంది.

దీనికోసం 1.5 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టబోతున్నారట. అయితే తారక్ కొంటున్నది విల్లా కాదని అపార్ట్ మెంట్ అని కొందరు అంటున్నారు. స్పెయిన్ లో ప్రభుత్వం విదేశీయులను తమ ప్రాంతంలో ప్రాపర్టీస్ కొనమని ఎంకరేజ్ చేస్తుంటుంది. కమర్షియల్ అయినా, రెసిడెన్షియల్ అయినా ఎలాంటి సమస్య ఉండదు.