హాలీవుడ్ ఆస్కార్ సైతం తన దగ్గరకు వచ్చేలా చేసుకున్న ఒకే ఒక్క ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్. ఆయన పాట తెలియని మనిషి ఉండడు. ఎక్కువగా హంగు ఆర్బాటం లేకుండా తన పాటలతోనే సమాధానం ఇస్తుంటారు. ఇకపోతే ఆయన మేనల్లుడు జివి.ప్రకాష్ కుమార్ కూడా సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పుడు నటుడిగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. త్వరలోనే సర్వం తాళమయం అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ మామ అల్లుళ్ళ మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. నువ్వు రెహమాన్ కి బయపడతావా అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు జివి చాలా బయపడిపోతాను అని చెప్పాడు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చేసేవన్నీ అని సమాధానం ఇచ్చాడు. 

అయితే ఇది చూసిన రెహమాన్ మేనల్లుడికి కౌంటర్ ఇచ్చాడు. అసలు నేను తిట్టింది ఒక్కసారే అయినా ఎన్నో సార్లు తిట్టినంతగా బయపడుతున్నావు. నిజంగా నువ్వు అంతగా బయపడ్డవా అంటూ.. లేకుంటే నటిస్తున్నావా అని రెహమాన్ ప్రశ్నించారు. ఇక నీ నటన ఇప్పటికే అందరికి తెలిసిందని.. నా విషయంలో మరి అంతగా నటించాల్సిన అవసరం లేదని సరదాగా చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.