టాలీవుడ్ లో గత వారం వరకు 2.0 మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ రేంజ్ బాగానే పెంచింది. అయితే ఈ వారం తెలుగులో ఏ సినిమా హడావుడి కనిపించడం లేదు. పైగా నామమాత్రం టాక్ తెచ్చుకున్న సినిమాలకు హాలీవుడ్ ఆక్వామేన్ దెబ్బ గట్టిగానే పడినట్లు తెలుస్తోంది,. 

తెలుగులో సముద్రపుత్రుడు పేరుతో విడుదలైన ఈ సినిమా విజువల్ వండర్ గా క్లిక్ అవ్వడంతో ఫాంటసీ ఆడియెన్స్ బాగా ఆకర్షితులవుతున్నారు. ఇంగ్లీష్ లో అయితే వీకెండ్ కి హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలుగులో కూడా సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో భైరవగీత - మోహన్ లాల్ ఒడియాన్ సినిమాల కలెక్షన్స్ తగ్గిపోయాయి. 

డైరెక్ట్ తెలుగు సినిమా హుషారుకి పాజిటివ్ టాక్ కొంత వచ్చినప్పటికీ స్టార్ నటీనటులు లేకపోవడంతో జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేయలేకపోతోంది. ఇక ఈ వారం సముద్రపుత్రుడు బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించేలా ఉన్నాడని తెలుస్తోంది. బయ్యర్స్ సినిమాను మరిన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.