AP Ticket Prices: శత్రువుకి శత్రువు మరి మిత్రుడేగా!
వర్మ టికెట్స్ ధరలు తగ్గింపు చర్యను ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారనేది పక్కనపెడితే, ఆయన వాదన పవన్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. వారందరూ ఈ వివాదంలో వర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ టికెట్స్ ధరలు వివాదం కేంద్రంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ను బద్ధశత్రువుగా భావించే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... ఆయన అభిమానులైపోయారు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్స్ కి లైక్స్ కొడుతూ, రీట్వీట్స్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. వర్మ తోపు దమ్ముంటే ఆపు అంటూ కొటేషన్స్ కొడుతున్నాడు. ఆయన ప్రశ్నలకు ఫిదా అవుతూ.. అదీ లాజిక్ అంటే అని పండగ చేసుకుంటున్నారు.
సడన్ గా వాళ్లలో ఈ మార్పుకు కారణం వర్మ టికెట్స్ ధరల పై పోరాటం మొదలుపెట్టాడు.టికెట్స్ ధరలు తగ్గించడం సరికాదని ఏపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఏదో ఒక కామెంట్ చేసి వదిలేయకుండా... అటో ఇటో తేల్చుకుంటా అంటున్నారు. వరుస ప్రశ్నలతో ఏపీ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నాడు. వర్మ టికెట్స్ ధరలు తగ్గింపు చర్యను ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారనేది పక్కనపెడితే, ఆయన వాదన పవన్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. వారందరూ ఈ వివాదంలో వర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఊహించని పరిణామమే అని చెప్పాలి. వర్మను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ పొగిడే రోజు వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. వర్మకు వాళ్లకు మధ్య ఉన్న అగాధం అలాంటిది. పలుమార్లు వర్మ ఆఫీస్ పై దాడి చేసి ఆయనను కొట్టడానికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్ ని కించపరుస్తూ వర్మ చేసిన సినిమాలు ఫ్యాన్స్ ని అంతులేని ఆవేశానికి గురి చేశాయి. వర్మ అంటే చాలు వాళ్లకు గుండెలు మండిపోతాయి. అసలు ఛాన్స్ రావాలె కానీ.. ఆయన్ని కొరుక్కు తినేయాలనేంత కోపం వాళ్లలో గూడుకట్టుకుని ఉంటుంది.
తమ అభిమాన హీరో సినిమా బాగోలేదు అంటేనే కోపంతో ఊగిపోయే ఫ్యాన్స్ కి.. ఆయన రాజకీయ వైఫల్యాలు, వ్యక్తిగత జీవితాన్ని బట్టబయలు చేస్తూ సినిమాలు చేసిన వారిపై ఎంత ఆవేశం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా టికెట్స్ ధరలు(AP Tickets Prices) పెంపు కోసం ఏపీ ప్రభుత్వం తో వర్మ చేస్తున్న పోరాటం పవన్ ఫ్యాన్స్ అవన్నీ మర్చిపోయేలా చేస్తాయి. పవన్ మొదట్నుంచి టికెట్స్ ధరల తగ్గింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, వర్మ ఆయనకు మద్దతుగా నిలబడినట్లు అయ్యింది.
ఇక వర్మపై వాళ్ళ ఆకస్మిక అభిమానానికి కారణం వైసీపీ (YCP Government) ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే. జనసేన కార్యకర్తల ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలు. పవన్ పార్టీ స్థాపించిన నాటి నుండి జగన్ ఆయన ప్రధాన టార్గెట్ గా ఉన్నారు. దేశంలోని అన్ని పార్టీలతో జనసేన పొత్తుపెట్టుకుంది. ఒక్క వైసీపీ పార్టీ మొదట్నుంచి జనసేనకు రైవల్ పార్టీగా ఉంది. ఇక వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పవన్ విమర్శల దాడి వాళ్ళనుద్దేసించే ఉంటుంది. పవన్ అనుచరులుగా ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ సైతం అదే వ్యతిరేకత వైసీపీ పట్ల కలిగి ఉన్నారు. కాబట్టి వైసీపీని విమర్శించే, ఇరుకున పెట్టే ఏ వ్యక్తికైనా, పార్టీకైనా వాళ్ళ మద్దతు ఉంటుంది. ఒకప్పుడు వర్మ వాళ్ళ బద్దశత్రువు అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మిత్రుడయ్యాడు.మరి శత్రువుకు శత్రువు మిత్రుడన్న విషయం తెలిసిందే కదా..
Also read Varma vs Perni Nani: వర్మ-పేర్ని నాని మధ్య కుదిరిన సంధి.. త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్స్