సారాంశం

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆపరేషన్ చేయాలని తెలుస్తుంది. అందుకు అయ్యే ఖర్చు ఏపీ ప్రభుత్వం భరించనుందని సమాచారం. 
 

జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ ఒకరు. ఈయనకు కిడ్నీ సమస్య ఉంది. డయాలసిస్ చేయించుకుంటూ నెట్టుకొస్తున్నారు. ఆ మధ్య పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఈ విషయాన్ని పంచ్ ప్రసాద్ భార్య స్వయంగా వెల్లడించారు. కిడ్ని తనది ఇవ్వడానికి సిద్ధం కాగా, వైద్యులు డోనర్ నుండి ఆరెంజ్ చేశారని ఆమె అన్నారు. పంచ్ ప్రసాద్ ది చిన్న వయసే కాబట్టి భవిష్యత్తులో అవసరమైతే ఆమె ఇవ్వొచ్చని అన్నారని చెప్పారు. 

తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తోటి కమెడియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పంచ్ ప్రసాద్ కి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆయన్ని ఆర్థికంగా ఆదుకోవాలని బ్యాంకు, యూపీఐ డీటెయిల్స్ షేర్ చేశారు. దీంతో ఓ నెటిజెన్ ఈ విషయాన్ని ఏపీ సీఎంఓ పరిధికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారాలను పర్యవేక్షించే సీఎంఓ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ఆల్రెడీ మా టీం పంచ్ ప్రసాద్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన సమాధానం చెప్పారు. 

ఈ క్రమంలో పంచ్ ప్రసాద్ అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తిరిగి కోలుకొని జబర్దస్త్ లో సందడి చేయాలని కోరుకుంటున్నారు. ప్రసాద్ ఆరోగ్యం దెబ్బతిని చాలా కాలం అవుతుంది. జబర్దస్త్ కమెడియన్స్ ఆయనకు అండగా ఉంటున్నారు. అనారోగ్యంతోనే పంచ్ ప్రసాద్ షోలు చేస్తున్నారు. ఆ విధంగా వచ్చే డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నాడు.