టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకి జగన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. టికెట్ల రేట్లకి సంబంధించిన కొత్త జీవోని తీసుకొచ్చింది. ఈ జీవోని సోమవారం సాయంత్రం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. 

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకి జగన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. టికెట్ల రేట్లకి సంబంధించిన కొత్త జీవోని తీసుకొచ్చింది. ఈ జీవోని సోమవారం సాయంత్రం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ రాష్ట్రంలోని థియేటర్లని ప్రధానంగా మూడు ఏరియాలుగా విభజించింది. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర(గ్రామ) పంచాయితీలుగా విభజించింది. ఆ ప్రకారంతో టికెట్ రేట్లని నిర్ణయించింది. ఇక థియేటర్లకి సంబంధించిన నాన్‌ ఏసీ, ఏసీ, స్పెషల్‌ థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లుగా టికెట్ల రేట్లని ఖరారు చేసింది. 

ప్రతి థియేటర్‌లో ప్రీమియం, నాన్‌ ప్రీమియంగా విభిజిస్తూ టికెట్‌ రేట్లని నిర్ణయించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం రూ.40, ప్రీమియం సీట్లలో రూ.60గా విభజించింది. మరోవైపు ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం - 70, ప్రీమియం-100గా, స్పెషల్‌ థియేటర్లలో నాన్‌ ప్రీమియం-100గా, ప్రీమియంలో సీట్లలో-125గా, మల్టీఫ్లెక్స్ లో నాన్‌ ప్రీమియం-150, ప్రీమియం 250గా నిర్ణయించింది. 

Scroll to load tweet…

ఇక మున్సిపాలిటీలో నాన్‌ ఏసీ థియేటర్లకి సంబంధించిన నాన్‌ ప్రీమియం-30, ప్రీమియం-50, ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం-60, ప్రీమియం-80గా, స్పెషల్‌ థియేటర్లలో నాన్‌ ప్రీమియం-80, ప్రీమియం 100గా, మల్టీఫ్లెక్స్ ల్లో నాన్‌ ప్రీమియం-125, ప్రీమియం 250గా నిర్ణయించింది. మరోవైపు నగర, గ్రామ పంచాయితీల్లో నాన్‌ ఏసీ థియేటర్లకి సంబంధించిన నాన్‌ ప్రీమియం-20, ప్రీమియం-40, ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం-50, ప్రీమియం-70గా, స్పెషల్‌ థియేటర్లలో నాన్‌ ప్రీమియం-70, ప్రీమియం 90గా, మల్టీఫ్లెక్స్ ల్లో నాన్‌ ప్రీమియం-100, ప్రీమియం 250గా నిర్ణంచింది. అయితే మల్టీఫ్లెక్స్ ల్లో ప్రీమియంలో మాత్రం అన్ని ఏరియాల్లో థియేటర్లలోనూ సేమ్‌ రేట్‌ నిర్ణయించడం విశేషం. 

దీంతోపాటు ఉదయం 11 గంటల నుంచి, రాత్రి 90 గంటల వరకు మధ్యలో ఓషో చిన్న సినిమాల(20కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌ చిత్రాల)కు కేటాయించేలా కండీషన్‌పెట్టింది ప్రభుత్వం. ఇది తప్పనిసరి అని నిర్ణయించింది. అంతేకాదు వందకోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌ చిత్రాలకు టికెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే ఆ సినిమా కచ్చితంగా సినిమాలోని 20శాతం షూటింగ్‌ ఏపీలో చేసి ఉన్న చిత్రాలకే పరిగణలోకి తీసుకుని ఈ వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. ఈ జీవో రేపటి నుంచి(మార్చి 8) నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. గత ఏడాది కాలంగా చిత్ర పరిశ్రమ ఏపీలో తగ్గించిన టికెట్ ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు నష్టాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల థియేటర్లు రన్ చేయలేక మూసివేసిన పరిస్థితులు కూడా చూశాం. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున మెగాస్టార్ చిరంజీవి పలు మార్లు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వస్ట్ చేశారు. ప్రభాస్‌, మహేష్‌,రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌ నారాయణమూర్తి, అలీ, పోసానిలతో కలిసి చిరంజీవి సీఎం జగన్‌ని కలిసి సమస్యని వివరించారు. జగన్ త్వరలోనే సమస్యని పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. 

ఆ తర్వాత ఆ దిశగా అడుగు పడలేదు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` చిత్రం విడుదలయింది. ఆ చిత్రం కూడా తగ్గించిన టికెట్ ధరలతోనే విడుదలైంది. దీనితో మరోసారి ప్రభుత్వంపై విమర్శలు వినిపించాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం వల్ల జీవో ఆలస్యం అయింది అంటూ ఏపీ మంత్రులు భీమ్లా నాయక్ చిత్రంపై స్పందించారు. `భీమ్లా నాయక్` చిత్రాన్ని కొన్నిరోజులు వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ పేర్ని నాని కామెంట్స్ చేశారు. 

ఇదిలా ఉండగా శుక్రవారం ప్రభాస్ నటించిన `రాధే శ్యామ్` చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది పాన్ ఇండియా మూవీ. ఇప్పుడైనా సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేస్తుందా అనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సోమవారం ఎట్టకేలకు కొత్త జీవోని విడుదల చేయడం విశేషం. దీంతో ఇమ్మిడియెట్‌గా `రాధేశ్యామ్‌`కిది హెల్ప్ కాబోతుంది. అలాగే `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు రాబోతున్న భారీ సినిమాలకు ఈ టికెట్ రేట్లు పెద్ద ఊరటనిచ్చాయని చెప్పొచ్చు. ఉన్నంతలో బెటర్‌గా టికెట్ రేట్లు ఉన్నాయనే క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. మొత్తంగా చిరంజీవి శ్రమ ఫలించినట్లు అయింది.