ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కింది. నార్త్ లో రాంచరణ్ కి లేడీస్ ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. చరణ్ మాయలో పడ్డ మగువల జాబితాలో యంగ్ హీరోయిన్ కూడా చేరింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కింది. నార్త్ లో రాంచరణ్ కి లేడీస్ ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. RC15 షూటింగ్ పంజాబ్ లో జరుగుతున్నప్పుడు లేడీ ఫ్యాన్స్ ఎలా చరణ్ ని చుట్టూ ముట్టారో చూశాం. రాంచరణ్ తన పర్ఫెక్ట్ ఫిజిక్, హాట్ లుక్స్ తో మాయ చేసేశాడు.
చరణ్ మాయలో పడ్డ మగువల జాబితాలో యంగ్ హీరోయిన్ కూడా చేరింది. హాట్ బ్యూటీ అన్వేషి జైన్ రాంచరణ్ గురించి కామెంట్స్ చేసింది. అన్వేషి జైన్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అన్వేషి జైన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రాంచరణ్ గురించి అడిగినప్పుడు.. చరణ్ తో డేటింగ్ కి వెళ్లాలని ఉన్నట్లు తన కోరికని బయట పెట్టింది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో అన్వేషి జైన్ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.
శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో దివ్యాంష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాంచరణ్ శంకర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
