లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది.
లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. అనుష్క బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటోంది. దీనితో అనుష్క ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు వీలు కావడం లేదు.
ప్రస్తుతం అనుష్క్ శెట్టి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. దీనితో జేజమ్మని ఆడియన్స్ వెండితెరపై చూసి చాలాకాలమే అవుతోంది. బరువు సమస్య ఇంకా తీరకపోవడంతో అనుష్క కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు అనేది టాక్.
ఇటీవల మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనుష్క ఓ టెంపుల్ వద్ద సందడి చేసింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ అనుష్క లుక్ చూసి ఆశ్చర్యపోవడం ఆమె అభిమానుల వంతైంది. అనుష్క మరింత లావుగా మారి షాకిచ్చింది. దీనితో అనుష్క వెయిట్ ప్రాబ్లెమ్స్ కొనసాగుతున్నాయి అని అనుకోవచ్చు.

ఇటీవల కొందరు టాలీవుడ్ దర్శకులు అనుష్కని సంప్రదించినా ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అనుష్క తాజాగా ఓ తమిళ దర్శకుడికి ఓకె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఎవరో కాలేదు ఏ ఎల్ విజయ్. అనుష్క ఆల్రెడీ ఈ దర్శకుడితో దైవతిరుమగళ్ అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు విజయ్ కి అనుష్క రెండవ సారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. కోలీవుడ్ లోక్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది అని ప్రచారం జరుగుతోంది. ఏఎల్ విజయ్.. నటి అమలాపాల్ మాజీ భర్త అనే సంగతి తెలిసిందే. విజయ్ చివరగా జయలలిత బయోపిక్ 'తలైవి' చిత్రం తెరకెక్కించారు. అయితే అనుష్క, ఏ ఎల్ విజయ్ చిత్రం ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.
