ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో నటించే లేడి సూపర్ స్టార్ అనుష్క మరో సరికొత్త ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓ మంచి భక్తిరస చిత్రంలో స్వీట్ నటించనున్నట్లు సమాచారం. ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన సంతోష్ శివన్ తెరకెక్కించే బోయే అయ్యప్ప స్వామికి సంబందించిన కథకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

ఉరిమి వంటి సినిమాతో దర్శకుడిగాను మంచి గుర్తింపుతెచ్చుకున్న సంతోష్ చాలా రోజుల తరువాత మళ్ళీ ఒక హిస్టారికల్ సినిమాకు శ్రీకారం చూడుతున్నారు. అయితే శబరిమలకు సంబందించిన వివాదాలు ఇటీవల ఏ స్థాయిలో అలజడులను సృష్టించాయో అందరికి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అనుష్క అయ్యప్ప భక్తురాలిగా కనిపించనున్నట్లు టాక్ వస్తుండడంతో ఆ రూమర్ కాస్త వైరల్ అవుతోంది. 

అయితే ఇది ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా భక్తి రస మార్గంలో తెరకెక్కబోయే సినిమా అని కోలీవుడ్ లో మరో టాక్ వస్తోంది. అయ్యప్ప జీవితాన్ని తెరపై చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.