కాంతార సినిమా వల్ల కర్ణాటకలో ఒక ప్రాంతానికే పరిమితం అయిన భూత కోల.. ప్రస్తుతం దేశమంతా పాపులర్ అయ్యింది. సెలబ్రిటీల్ సైతం ఈ ఉత్సవాలను చూడాలని ముచ్చటపడుతున్నారు. రీసెంట్ గా అనుష్క శెట్టి.. ఈ ఉత్సవాలకు కుటుంబంత సహా హాజరయ్యారు.
కాంతార సినిమా తరువాత కోలం ఉత్సవాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇదివరకూ ఎక్కడా కనిపించని ఈ వీడియోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగాకనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ ఉత్సవాలలో పాల్గోనడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలోనే హీరోయిన్ అనుష్క శెట్టి కుటుంబ సమేతంగా కోలం ఉత్సవాలలో పాల్గొన్నారు. అనుష్కకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
మంగళూర్ లో జరిగిన భూత కోల వేడుకల్లో అనుష్క తన కుటుంబంతో కలిసి పాల్గొని సందడి చేసింది.ఈ భూత కోల వేడుకల్లో పాల్గొన్న అనుష్క అక్కడి నృత్యాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది. చాలా బొద్దుగా ఉండే అనుష్క ఇప్పుడు నాజూగ్గా తయారైనట్టు కనిపిస్తోంది. పట్టుచీర కట్టుకొని నాజూగ్గా కనిపిస్తున్న అనుష్క ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.. అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. బాహుబలి అరుంధతి భాగమతి వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో అనుష్క ఇమేజ్ ఎక్కడికో వెల్లిపోయింది. ఇక నిశ్శబ్ధం సినిమా తరువాత చాలా కాలంగా సినిమాలకుదూరంగా ఉంటున్న అనుష్క శెట్టి.. ప్రస్తుతం ఓ సినమాలో నటిస్తోంది. నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతునన ఈమూవీ షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క సోషల్ మీడియాలో, మీడియాలో కూడా ఎక్కడా కనిపించటం లేదు. సరిగ్గా ఇదే టైమ్ లె కోలా ఉత్సవాల్లో ఆమె కనిపించే సరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అనుష్క సినిమా త్వరగా రిలీజ్ కావాలని వెయిట్ చేస్తున్నారు అభిమానులు
ఇక ఇదిలా ఉండగా చిన్న సినిమాగా రిలీజ్అయిన కాంతార సినిమా.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 16 కోట్ల వరకూ.. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా. కోట్ల రూపాయలు కొల్లగొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా దర్శకుడు నటుడు అయిన రిషబ్ శెట్టి అద్భుతంగా నటించడతో పాటు.. డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాతనే భూతకోలా డాన్స్ తో పాటు ఆ వీడియోలు పాపులర్ అయ్యాయి.
