2011లో వచ్చిన వస్తాడు నా రాజు చిత్రం గుర్తుందా...మంచు విష్ణు హీరోగా వచ్చిన ఆ చిత్రం భాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ చిత్రం దర్శకుడు హేమంత్ మధుకర్. ఆ తర్వాత తెలుగులో సినిమాలు ప్రయత్నం చేసాడు కానీ వర్కవుట్ కాలేదు. ముంబైకు వెళ్లి మణిశర్మతో కలిసి ముంబై 125 కిలోమీటర్స్ అనే హర్రర్ చిత్రం తీసాడు. కానీ ఆ సినిమా ఆడలేదు. 

నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో చిత్రం మొదలెట్టాడు. అయితే ఈ సారి అనుష్కని సీన్ లోకి తీసుకు వచ్చాడు. బాహుబలితో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న అనుష్క షెట్టి తో సినిమా మొదలెట్టాడు. 'సైలెన్స్' అనే టైటిల్ తో రూపొందే ఈ  చిత్రంలో అనుష్క వినికిడి లోపంతో పాటు మాట్లాడలేని మహిళా పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది.  

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన అనుష్క.. ఆ తరువాత ఆమె ఏ సినిమా కమిటవ్వలేదు.  కొంతకాలం పాటు గౌతమ్ మీనన్ సినిమా అన్నారు కానీ, అది ఇప్పటివరకు  ఆ ప్రాజెక్ట్ ముందుకు రాలేదు. దాంతో  ఫ్యాన్స్ ఆమె సినిమా ఎప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఈ ప్రాజెక్టు మొదలైంది.  గ్యాప్  తీసుకుని అనుష్క చేస్తున్న ఈ సినిమాలో మాధవన్ మరో కీ పాత్రలో కనిపించనున్నారు.  థ్రిల్లర్ జానర్ లో  ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది.

తాజాగా సినీవర్గాల నుంచి అందుతున్న  సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ‘అరుంధతి, భాగమతి’ తరహా చిత్రాలు లాగానే ఈ చిత్రంలో కూడా అనుష్క పెర్ఫామెన్స్ నే హైలెట్ అవబోతోందని టాక్.  దానికి తోడు అనుష్క ఈ సినిమాలో బాగా వైలెంట్ క్యారెక్టర్ లో కనపడనుందిట. మరి ఈ చిత్రం కూడా అనుష్క కెరీర్ లో మరో భారీ విజయంగా నిలిచిపోతుందేమో చూడాలి.