స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’ (Liger). మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చిత్రంపై స్పందించింది.  

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’ (Liger). పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 25)న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు చిత్ర ప్రమోషన్స్ ను కూడా ఓ రేంజ్ లో నిర్వహించడంతో ఆడియెన్స్ వద్ద బాగా రీచ్ అయ్యిందీ సినిమా. రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రంపై.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) స్పందించింది.

కేవలం రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆయా స్టార్ట్స్ స్పందిస్తూ ‘లైగర్’ టీంకు బెస్ట్ విషెస్ అందించారు. తాజాగా స్వీటీ కూడా స్పందించడం విశేషం. ఇన్ స్టా గ్రామ్ ద్వారా స్పందించిన అనుష్క శెట్టి ‘లైగర్’ యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పింది. సినిమా కోసం తానూ ఎదురుచూస్తున్నానని తెలిపింది. అయితే పూరీ జగన్నాథ్ ను ఇండస్ట్రీలో ‘జగన్, పూరి’ అంటూ చాలా మంది స్టార్స్ సంబోధించడం చూశాం.. కానీ అనుష్క శెట్టి మాత్రం పూరీ జగన్నాథ్ కు కొత్త పేరును పెట్టింది. పూరీ జగన్నాథ్ కు బదులుగా ‘జగ్గు దాదా’ అంటూ క్యాప్షన్ లో పేర్కొంది. ప్రస్తుతం అనుష్క పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అనుష్క ‘సూపర్’ చిత్రంలో నటించింది. 

‘బాహుబలి’ తర్వాత అనుష్క శెట్టికి ఆ స్థాయిలో సినిమాలు పడటం కష్టంగా మారింది. చివరిగా ‘నిశ్శబ్దం’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సుందరి కొన్నాళ్లుగా ఎలాంటి సినిమాలను ప్రకటించడం లేదు. ఇటీవల ‘చంద్రముఖి 2’ చిత్రంలో నటిస్తున్నదని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఆ ప్లేస్ లో మరోహీరోయిన్ చేరడంతో అభిమానులు అప్పెట్ అయ్యారు. మరోవైపు నవీన్ పొలిశెట్టి సరసన నటించనున్నట్టు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ ఇప్పటికీ అలాంటి వార్తలను కన్ఫమ్ చేస్తూ స్విటీగానీ, నవీన్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇక ‘లైగర్‌’ విషయానికొస్తే విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. Ananya Pandayకు సౌత్ ఎంట్రీకి ఇదితొలి చిత్రం కానుంది. అటు విజయ్ కు కూడా బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ఇదే కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు. పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగు, హిందీలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు. 

View post on Instagram