దక్షిణాదిలో టాప్ హిరోయిన్ ఎవరా అంటే ఇప్పుడున్న వాళ్లలో ఫస్ట్ గుర్తొచ్చేది అనుష్క పేరే. అటు కమర్షియల్ చిత్రాల్లోనేకాక.. ఇటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ సత్తా చాటుతున్న అనుష్క.. టాలీవుడ్ లో హైయెస్ట్ సక్సెస్ రేట్ వున్న హీరోయిన్ గా రాణించింది. అటు గ్లామర్ పాత్రల్లోనే కాక ఇటు స్త్రీ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తూ రెండు విధాలుగా సక్సెస్  ఫుల్ గా.. కెరీర్ ను కొనసాగించిన వాళ్లు అనుష్క తప్ప మరెవరూ లేరు.

 

బాహుబలి తర్వాత ప్రపంచమంతా తనకంటూ ఫాలోయింగ్ సాధించిన అనుష్క... రీసెంట్ గా భాగమతి చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. బాహుబలి మూవీలో ప్రభాస్ తో అనుష్క కెమిస్ట్రీ అదిరిపోయింది.  మరోవైపు ప్రభాస్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్. దీంతో ఆమె ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడనే ప్రశ్న మాత్రం వెంటాడుతునే వుంది. అయితే స్వీటీ తన పెళ్లి గురించి పెద్దగా ఇంట్రస్టింగ్ గా మాట్లాడటం లేదు కానీ.. పిల్లలంటే మాత్రం తనకు చాలా ఇష్టమంటోంది.

 

తన పెళ్లి గురించి మరీ ఎక్కువగా ఆలోచించొద్దంటూ అభిమానులకు ఉచిత సలహా కూడా ఇస్తోంది. తన పెళ్లి గురించి వచ్చే ఊహాగానాలను కూడా పెద్దగా పట్టించుకోవద్దని అంటోంది. మరోవైపు నాకు పిల్లలంటే భలే ఇష్టం. కానీ అదొక్కటే పెళ్లి చేసుకోవడానికి రీజన్ కాదు కదా. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా వెంటనే నేనే ఆ సంగతి పిలిచి మరీ చెబుతాను. ఈలోగా ఫలానా వాళ్లతో పెళ్లి అంటూ వచ్చే రూమర్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటోంది అనుష్క.
 

ఓ పక్క పిల్లలంటే ఇష్టమంటోంది.. పెళ్లి మాటెత్తితే మమాత్రం దాటేస్తోంది. మరి పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలంటే ఎలా... బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ లా దత్తత తీసుకుంటుందా.. తన పెళ్లి పై అనుష్క స్పందన చూస్తుంటే అలాంటి ఆలోచనలేవో చేస్తున్నట్టే ఉంది. ఆమె అభిమానులేమో చక్కగా పెళ్లి చేసుకోమని సలహాలిస్తున్నారు. మరి చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.