Asianet News TeluguAsianet News Telugu

తన సీక్వెల్ సినిమాతో హాఫ్ సెంచరీ కొట్టబోతున్న అనుష్క..

50వ సినిమాతో రికార్డ్ సృష్టించాలి అని చూస్తుంది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. తన హాఫ్ సెంచరీ మూవీని తన సినిమా సీక్వెల్ తోనే కంప్లీట్ చేయాలని చూస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

Anushka Shetty Bhaagamathie Movie Sequel Update JMS
Author
First Published Nov 7, 2023, 1:01 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోలకుసమానంగా క్రేజ్ తో పాటు.. స్టార్ డమ్ కూడా సాధించింది హీరోయిన్ అనుష్క శెట్టి అరుధతి, భాగమతి, భహుబలి లాంటిసినిమాలతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈసినిమాల తరువాత ఆమెఆల్మెస్ట్ సినిమాలకుదూరంగానే ఉంటూ వచ్చింది. రీసెంట్ గానే నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్ నుపలుకరించింది. అయితే ఈమూవీ తరువాత ఆమె చేయబోయే సినిమాతో అనుష్క కెరీర్ లో 50 సినిమలు కంప్లీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఈరోజు (నవంబర్ 7) అనుష్క భర్త్ డే కావడంతో.. ఫ్యాన్స్ ఆమెకు వరుసగా శుభాకాంక్షలు వెల్లువలా చెపుతున్నారు.  రీసెంట్ గా మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన అనుష్క శెట్టి.. తన 50 సినిమా చేయాలని చూస్తుందట. అయితే ఈసినిమా కూడా తన సూపర్ హిట్ సినిమాల్లో ఒక సినిమాకుసీక్వెల్ గా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఏంటీ అని అంతా ఉత్కంటగా ఎదరు చూస్తున్నారు. 

అనుష్క సూపర్ హిట్ సినిమాలో ఫస్ట్ ప్లేస్ అరుధతికే దక్కుతుంది. కాని  ఈసినిమా సీక్వెల్ కాని.. రీమేక్ కాని  చేసే ధైర్యం ఎవరికీ లేదు. కొన్ని సినిమాలు టచ్ చేయకపోవడమే మంచిది. రీసెంట్ గా చంద్రముఖి విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికి తెలిసిందే. 

ఇక అనుష్క నటించి.. సాలిడ్ హిట్ స్కోర్ చేసిన వాటిలో భాగమతి సినిమా కూడా ఒకటి. అయితే ఈమూవీకి సీక్వెల్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారట మేకర్స్.  ఈ చిత్రానికి అయితే ఇప్పుడు సీక్వెల్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 2018లో వచ్చిన ఈ చిత్రం అనుష్క కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచింది. 

మరి ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ని అయితే అనుష్క కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 50వ సినిమాగా చేయనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఏదైనా వస్తే కాని క్లారిటీగా తెలుస్తుంది. భాగమతికి సీక్వెల్ ఉంటుందా లేదా అనేది. 

Follow Us:
Download App:
  • android
  • ios