యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఇండియన్ స్క్రీన్ లో మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరక్కుతున్న ఈ చిత్రంలో ఎవిలిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

మంగళవారం రోజు సాహూ చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ స్పై లుక్ లో అదరగొడుతున్నాడు. సాహో చిత్రాన్ని అబుదాబి, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహో లేటెస్ట్ పోస్టర్ పై అనుష్క సోషల్ మీడియాలో స్పందించింది. 

ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విశేషం నన్ను ఉత్కంఠకు గురిచేస్తోంది. నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తి కలుగుతోంది. సాహో చిత్రం కోసం అంత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నా. ప్రభాస్, దర్శకుడు సుజిత్, యువి క్రియేషన్స్ సంస్థకు, ఈ చిత్రంలో పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్ కు ఆల్ ది బెస్ట్ అంటూ అనుష్క సోషల్ మీడియాలో స్పందించింది. 

అనుష్క, ప్రభాస్ వెండితెరపై తిరుగులేని జోడి. వీరిద్దరూ జంటగా బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించారు. ఇక అనుష్క యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన భాగమతి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.