సెలబ్రిటీ కపుల్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ముచ్చటగా మూడేళ్ళ వివాహ బంధం పూర్తి చేసుకున్నారు. డిసెంబర్ 11, 2017లో అనుష్క, విరాట్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నేడు పెళ్లి రోజు కావడంతో అనుష్క, విరాట్ సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు ప్రేమ సందేశం పంపుకున్నారు. వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ గా మారాయి. 
 
అనుష్క ''మూడేళ్ళ మన బంధంతో త్వరలో ముగ్గురు కాబోతున్నాం... ఐ మిస్ యూ' అని సందేశం పోస్ట్ చేశారు. అలాగే విరాట్ ని వెనుక నుండి కౌగిలించుకున్న ఫోటోని పోస్ట్ చేశారు. ఆగస్టు నెలలో అనుష్క తాను గర్భవతి అన్న విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. జనవరి నెలలో అనుష్క బిడ్డకు జన్మను ఇవ్వనుంది.ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ లో ఉండగా, యానివర్సరీ రోజు తనను మిస్ అవుతున్నట్లు అనుష్క తెలియజేశారు. 
 
అలాగే విరాట్ సైతం 'ఇప్పటికి మూడేళ్లు... జీవితాంతం వరకు ఈ బంధం అని' పోస్ట్ చేశాడు. 2013లో ఓ షాంపూ యాడ్ షూట్ కోసం విరాట్, అనుష్క కలవడం జరిగింది. అప్పటి నుండే వీరి మధ్య పరిచయం ప్రేమ మొదలయ్యాయి. విరాట్ కోసం అనుష్క క్రికెట్ స్టేడియంకి వస్తూ ఉండేది. విరాట్ కూడా అనుష్క కోసం షూటింగ్ సెట్స్ కి వెళ్లడం చేసేవారు. ఇద్దరు కలిసి టూర్స్ కి వెళ్లడం, చట్టా పట్టాలేసుకొని తిరగడంతో వీరి ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది.. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)