Asianet News TeluguAsianet News Telugu

తల్లి కాబోతున్న అనుష్కశర్మ...గర్భంతో పోజిచ్చిన స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తల్లికాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశారు. దీనితో విరాట్-అనుష్క తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

anushha sharm reveals her pregnancy to the fans
Author
Hyderabad, First Published Aug 27, 2020, 12:03 PM IST

బాలీవుడ్ స్టార్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ క్రేజీ న్యూస్ పంచుకున్నారు. వీరు త్వరలో అమ్మానాన్నా కాబోతున్నట్లు తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం అని తెలియజేశారు. అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ క్రేజీ కపుల్ ఓ ఫోటోకి పోజివ్వగా అందులో అనుష్క శర్మ బేబీ బంప్ తో దర్శనం ఇచ్చింది. వారు చెబుతున్న డేట్ ని బట్టి చూస్తే అనుష్క ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని తెలుస్తుంది. అనుష్క శర్మ పబ్లిక్ ప్రదేశాలలో దర్శనం ఇచ్చి చాలా కాలం అవుతుంది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు. 

అనుష్క శర్మ కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనితో వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనుష్క శర్మ, విరాట్ ఫాన్స్ తో పాటు, బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెవుతున్నారు. కోట్లాది మంది అభిమానులను విరాట్ మరియు అనుష్క కలిగి ఉండగా, సోషల్ మీడియాలో ఈ విషయంగా భారీగా ట్రెండ్ అవుతుంది. 

2008లో వచ్చిన రబ్ నే బనాదీ జోడీ చిత్రంతో అనుష్క వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రఖ్యాత యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా నటించగా భారీ విజయాన్ని అందుకుంది. బ్యాండ్ భాజా బారాత్, పీకే వంటి చిత్రాలు ఆమెను హీరోయిన్ గా నిలబెట్టాయి. ఇక విరాట్ 2014లో అనుష్క ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ప్రేమ పక్షులుగా బహిరంగంగా దిగిన ఈ జంట 2017లో గ్రాండ్ గా పెళ్లిచేసుకున్నారు. పెళ్ళైన ఇన్నేళ్లకు అనుష్క గర్భం దాల్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios