అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన `జేఎస్‌ కే- జానకి వీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ` మూవీ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్‌ కానుంది.

DID YOU
KNOW
?
`పరదా`తో అనుపమా
అనుపమా పరమేశ్వరన్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `పరదా` చేస్తుంది. ఈ చిత్రం ఆగస్ట్ 22న విడుదల కానుంది.

ఓటీటీలోకి `జే ఎస్‌ కే- జానకి వర్సెస్ స్టేట్‌ ఆఫ్‌ కేరళ` మూవీ

మలయాళంలో సంచలనం సృష్టించిన మూవీ `జే ఎస్‌ కే- జానకి వర్సెస్ స్టేట్‌ ఆఫ్‌ కేరళ`. ఆ మధ్య థియేటర్లో విడుదలై మలయాళంలో పెద్ద దుమారం రేపింది. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ నటించడం విశేషం. కోర్ట్ రూమ్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అక్కడ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. 

జీ5లో అనుపమా వివాదాస్పద మూవీ

జీ 5లో ఆగస్ట్ 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని జీ 5 టీమ్‌ వెల్లడించింది. `విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K - జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది` అని జీ5 టీమ్‌ వెల్లడించింది.

జే ఎస్‌ కే- జానకి వర్సెస్ స్టేట్‌ ఆఫ్‌ కేరళ` మూవీ స్టోరీ లైన్‌

సురేష్ గోపి, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ఇందులో ఆసక్తికరం.

ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆగస్టు 15న ‘J.S.K - జానకి V vs. స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5లో మాత్రమే చూడొచ్చు.

వివాదం ఏంటంటే?

ఇందులో మెయిన్‌ క్యారెక్టర్‌ అయిన అనుపమా పరమేశ్వరన్‌ పాత్ర పేరు జానకి. ఆమె లైంగిక వేధింపులకు గురవుతుంది. అయితే హిందూ పురాణాల్లో ఒకటైన రామాయణం ప్రకారం జానకి అంటే సీత. లైంగింక వేధింపులకు గురైన అమ్మాయికి ఆ పేరు పెట్టడమంటే సీతని అవమానించడమే అని పలు హిందూ సంఘాలు గొడవ చేశాయి. పేరుని మార్చాలని డిమాండ్‌ చేశాయి. దీంతో ఇది కేరళాలో పెద్ద రచ్చ అయ్యింది. చివరికి పేరులో చిన్న మార్పు చేశారు.