టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో మంచి క్రేజే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. త్వరలోనే ఆమె నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో మంచి క్రేజే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. త్వరలోనే ఆమె నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని శ్రీరెడ్డి ఎప్పుడైతే ఆరోపణలు చేయడం మొదలుపెట్టిందో.. అప్పటినుండి నటీమణులు ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ విషయంపై స్పందించిందని పేర్కొంటూ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది.
అందులో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమేనని, ఇండస్ట్రీకి వస్తోన్న కొత్త హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటున్నారని అనుపమ వెల్లడించినట్లు ఆ వార్తలో రాసుకొచ్చారు.
అయితే ఈ విషయం అనుపమని బాధ పెట్టింది. ఇలాంటి వార్తలు పుట్టిస్తోన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ఎందుకు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తారు..? నేను కాస్టింగ్ కౌచ్ విషయంపై ఏ ఇంటర్వ్యూలోనూ అలా మాట్లాడలేదు'' అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి అభిమానులు మద్దతు తెలుపుతూ ఆమెకు సందేశాలు పంపిస్తున్నారు.
