నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా చేస్తున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ను పొందింది.
నాచురల్ స్టార్ నాని గత సంవత్సరం ‘శ్యామ్ సింగరాయ్’ తో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఫ్లాఫ్ అనిపించుకున్నాయి. ఇప్పుడు నాని నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ గా దీన్ని రూపొందించారు.
‘అంటే సుందరానికీ’ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఫారిన్ నేపథ్యంలో కూడా నడిచినట్లు కనిపిస్తుంది. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి లవ్ స్టోరీకి వాళ్ల తల్లిదండ్రులు పాటించే సాంప్రదాయాలే అడ్డంకిగా మారడంతో.. నాని నజ్రియాలు ఫారిన్ వెళ్లిపోతారు. అక్కడే పెళ్లి చేసుకోని పాపకి కూడా జన్మనిస్తారు. ఈ విషయం రెండు కుటుంబాలకి తెలిసిపోవడంతో వచ్చే ఫన్.. ‘అంటే సుందరానికీ’ సినిమాకి మెయిన్ హైలైట్ అయ్యేలా ఉంది. నాని-హర్ష ట్రాక్‌తోనే మొదలయ్యే ఈ చిత్రం మొదటి భాగమంతా ఇండియాలో, రెండవభాగం అంతా ఫారిన్‌లో ఉండే అవకాశం ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
ఇక ఈ చిత్రం యుఎస్ ప్రీమియర్స్ కోసం టీమ్ మొత్తం ఎదురుచూస్తోంది. అక్కడ నుంచి మంచి టాక్ వస్తే అది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఓపినింగ్స్ పై ఇంపాక్ట్ చూపెడుతుంది. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఫన్ తో నడిచే లవ్ స్టోరీలకు అక్కడ మంచి డిమాండ్ ఉంది. ఆ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. కాబట్టి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని టీమ్ మొత్తం భావిస్తోంది.
ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా చేస్తున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ను పొందింది. రన్ టైమ్‌ను 2 గంటల 56 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అంటే దాదాపు మూడు గంటల రన్ అన్నమాట. చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్, తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్‌ను హీరో నాని తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారని, అలాగే ప్రీ రిలీజ్ జూన్ 9వ తేదీన జరుగనుందని నాని తెలిపారు.
అంతకుముందు ప్రీ రిలీజ్ వేడుక జూన్ 8 అని మేకర్స్ తెలపడమే కాకుండా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెట్టారు. తాజాగా నాని ప్రీ రిలీజ్ వేడుక 9 అని ప్రకటించడమే కాకుండా.. పవర్ స్టార్ ఈ వేడుకకు వస్తున్నారని చెప్పడంతో.. ‘అంటే సుందరానికీ’ చిత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ‘‘సుందర్ ప్రసాద్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్. థ్యాంక్యూ పవన్ కల్యాణ్ గారు. ఈ విషయం తెలిసి చిత్రయూనిట్, నేను ఎంతగానో థ్రిల్ అయ్యాం. 9న జరిగే ప్రీ రిలీజ్ వేడుక కోసం ఎంతగానో వేచిచూస్తున్నాం..’’ అని నాని ట్వీట్ చేశారు.
