హీరో నాని మరో కామెడీ సినిమాతో వస్తున్నారు. ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన `అంటే సుందరానికి` చిత్రంలో నటించారు. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తుంది.
నేచురల్ స్టార్ నాని మరో వైవిధ్యభరితమైన సినిమాతో వస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రస్తుతం `అంటే సుందరానికి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో నాని సుందర ప్రసాద్ పాత్రలో కనిపిస్తాడు. ఆయన ఫ్యామిలీ హిందూ సంప్రదాయాలను బాగా నమ్మే బ్రహ్మణ కుటుంబం. అలాంటిది ఓ క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమలో పడతారు. మరి పట్టింపులు ఎక్కువగా ఉన్న రెండు కుటుంబాలు వీరి ప్రేమని అంగీకరించా? అంతా ఓకే అనుకునే సమయంలో సుందరం గురించి ఓ వార్త తెలుస్తుంది. ఆ వార్తేంటి? `అంటే.. సుందరానికి ఏమైంది` అనేది ట్విస్ట్ తో టీజర్ ముగుస్తుంది.
దీంతో అప్పటి వరకు హంగామా చేసిన నాని, చివర్లో పెద్ద ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరిగిందనేది ఆసక్తి నెలకొంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నానికి జోడీగా నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మాతలు. ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయబోతున్నారు. సినిమా కథేంటో చెప్పి, ఎలా ఎంటర్‌టైన్‌బోతున్నామో కూడా టీజర్‌లో చెప్పడం విశేషం.

టీజర్ ఆద్యంతం సరదాగా సాగుతుంది. వివేక్ ఆత్రేయ హ్యుమర్‌కి, నాని ఇన్నెసెంట్ యాక్టింగ్ తోడవడంతో ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళంలోనూ విడుదల చేస్తున్నారు.
