తెలుగు చిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందని గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. లోలోపల సర్దుకోవాల్సిన చిన్న చిన్న పొరపాట్లను చింపి గాలి వానలా వారే సృష్టించుకుంటున్నట్లు అనేక రకాల కామెంట్స్ వచ్చాయి.

కానీ రీసెంట్ గా సీనియర్ దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి ప్యానెల్ లో ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో రచ్చ మళ్ళీ మొదటికి వచ్చింది. నరేష్ ప్యానెల్ లో కూడా పలు రకాల విమర్శలు వస్తున్నాయి. ఇదివరకే శివాజీ రాజా నరేష్ ప్యానెల్ పై ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా బయటకు వచ్చేయడంతో నిధుల దుర్వినియోగం వల్లే అయన బరాజీనామా చేసినట్లు టాక్ వస్తోంది. 

ఇదివరకు దర్శకుడు కృష్ణారెడ్డి శివాజీరాజా ప్యానెల్ ఉన్నారు. ఎన్నికల్లో ఆయన గెలిచిన అనంతరం కమిటీతో కలిశారు. కానీ ఇప్పుడు ఎందుకు ప్యానెల్ లో పదవికి రాజీనామా చేశారు అనేది చర్చనీయాశంగా మారింది. అయితే ఈ విషయంలో 'మా' ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.