సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు గౌతమ్ రాజు, గోరంట్ల రాజేంద్రప్రసాద్ మరణించగా.. తాజాగా ప్రముఖ అమెరికన్ నటుడు కన్నుమూయడం సినీ లోకంలో ఆందోళన నెలకొంది.  

చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక మరణవార్తను మరిచిలోపే.. మరో మరణవార్త వినాల్సి వస్తోంది. దీంతో సినీ పెద్దలు, ప్రముఖులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణం నుంచి వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నారు. ఆ వెంటనే ప్రముఖ సినీయర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతమ్ రాజు, ఆ తర్వాత నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్, ఆర్ నారాయణ మూర్తి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడం సినీ లోకాన్ని కలిచివేస్తోంది. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.

ప్రముఖ అమెరికన్ నటుడు జేమ్స్ కాన్ (James Cann) అనారోగ్యంతో తాజాగా కన్నుమూశారు. అనారోగ్యంతో 82వ ఏటా జేమ్స్ కాన్ గురువారం తుదిశ్వాసం విడిచారని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ లో జేమ్స్ తన నివాసంలోనే ఉదయం ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈవిషయాన్ని వెల్లడించారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనను తెలుసుకోగానే జేమ్స్ కాన్ అభిమానులు, హాలీవుడ్ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ణనలు చేస్తున్నారు. 

జేమ్స్ కాన్ యూఎస్ లోని న్యూయార్క్ సిటీలో 19400 మార్చి 26న జన్మించారు. 20 ఏండ్ల వయస్సులోనే జేమ్స్ తొలి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో విడిపోయి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈయనకు ఐదుగురు సంతానం ఉన్నారు. ఇందులో ఒకరు స్కాట్ అండ్రూ కాన్ అమెరికన్ యాక్టర్, డైరెక్టర్, ఫొటోగ్రాఫీగా గుర్తింపు పొందాడు. చిన్నప్పటి నుంచే థియేటర్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందిన జేమ్స్ సినీ రంగంలో అడుగుపెట్టారు. పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు.

హాలీవుడ్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ (God Father)లోనూ ఓ మాఫియా కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్రను పోషించాడు. ఈయన నటనకు గాను అప్పట్లోనే ‘ఆస్కార్ అవార్డు’ను అందుకున్నాడు. అంతేకాకుండా మిజరీ, థీఫ్, రోలర్ బాల్ లాంటి చిత్రాల్లో నటించి పలు అవార్డులు, పురస్కారాలను తన సొంతం చేసుకున్నాడు. జేమ్స్ చివరిగా ‘క్వీన్ బీస్’లో నటించారు. ఈ చిత్రం 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.