Asianet News Telugu

లవ్వే.. శింబు వలలో మరో బ్యూటీ?

ఎప్పుడు ఎదో ఒక వివాదంతో తమిళ జనాలకు చిరాకు తెప్పించే శింబు చాలా రోజుల తరువాత లవ్ రూమర్స్ ను ఎదుర్కొంటున్నాడు. శింబు ప్రేమ వ్యవహారాలు సౌత్ జనాలకు కొత్తేమి కాదు. సీజన్ కి ఒక హీరోయిన్ ని ప్రేమలోకి దింపి అందరికి షాక్ ఇస్తుంటాడు. నయనతారకి బ్రేకప్ చెప్పిన తరువాత హన్సికతో టచ్ లో ఉన్నాడు. 

another rumor on kollywood hero shimbu
Author
Hyderabad, First Published Feb 27, 2019, 8:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎప్పుడు ఎదో ఒక వివాదంతో తమిళ జనాలకు చిరాకు తెప్పించే శింబు చాలా రోజుల తరువాత లవ్ రూమర్స్ ను ఎదుర్కొంటున్నాడు. శింబు ప్రేమ వ్యవహారాలు సౌత్ జనాలకు కొత్తేమి కాదు. సీజన్ కి ఒక హీరోయిన్ ని ప్రేమలోకి దింపి అందరికి షాక్ ఇస్తుంటాడు. నయనతారకి బ్రేకప్ చెప్పిన తరువాత హన్సికతో టచ్ లో ఉన్నాడు. 

ఆ తరువాత అమ్మాయిలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మరో నటికి దగ్గరయినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు. బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయిన ఓవియా అని రూమర్స్ వస్తున్నాయి. పైగా ఈ రూమర్స్ పై ఓవియా స్పందించిన విధానంపై ఎదో ఉందిలే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓవియా 90 ఎమ్ఎల్ అనే అడల్ట్ సినిమాలో నటిస్తోంది. అయితే ఆ సినిమాకు శింబు సంగీతం అందిస్తున్నాడు. 

అదే విధంగా ఒవియాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేసి ఆమెకు బాగా దగ్గరైనట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ప్రమోషన్స్ లో శింబు పాల్గొంటూ అమ్మడికి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. ఇక ఓవియా రూమర్స్ తప్పంటునే ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలుసు అంటూ ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది. అలాగే శింబు లాంటి వ్యక్తి లైఫ్ లాంగ్ తోడుగా ఉంటె బెటర్ అని కూడా ఆమె చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios