రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ఎలా అడ్డుకోవాలా..? అని ప్లాన్లు చేస్తున్నారు టీడీపీ నేతలు.

రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ఎలా అడ్డుకోవాలా..? అని ప్లాన్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు కొత్త కష్టం వచ్చి పడింది.

అదేంటంటే 'భైరవ గీత' సినిమా. గతంలో వర్మ నిర్మాతగా 'భైరవ గీత'ని నిర్మించారు. దాన్ని విడుదలకు ముందే కొంతవరకు బిజినెస్ చేసేశారు. అయితే విడుదల ఆలస్యమవ్వడంతోసినిమా హక్కులు కొన్న అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ నామా సినిమా తమకు వద్దని చెప్పారు.

అయితే రిటర్నబుల్ అడ్వాన్స్ మీద సినిమాను విడుదల చేయడానికి ఒప్పించాడు వర్మ. దాంతో రెండు కోట్లకు పైగా డబ్బులిచ్చి విడుదల చేశారు. అలా విడుదలైన సినిమా కనీసపు ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయింది. ఆ మొత్తాన్ని రామ్ గోపాల్ వర్మ ఇవ్వాల్సివుంది. ఇప్పుడు వర్మ డైరెక్ట్ చేసిన'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ కి ఉండడంతో టైం చూసి పంచాయితీ పెట్టాడు అభిషేక్ నామా.

తనకు డబ్బులు తిరిగివ్వాలని, లేని పక్షంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నైజాం హక్కులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పంచాయితీ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా మొత్తం రైట్స్ కోసం ఓ బయ్యర్ కొంత డబ్బుని అడ్వాన్స్ గా ఇచ్చారు. ఈ క్రమంలో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!