ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన పెద్ద కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 'అల్లుడుశీను' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి నుండి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇంకా శ్రీనివాస్ హీరోగా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాకుండానే ఇప్పుడు రెండో కొడుకుని కూడా రంగంలోకి దించుతున్నాడు బెల్లంకొండ సురేష్. కాస్త బొద్దుగా ఉండే బెల్లంకొండ రెండో కొడుకు గణేష్ తన తండ్రిలానే నిర్మాతగామారాలని అనుకున్నాడు.

కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారడంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దానికి తగ్గట్లుగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. కొత్త దర్శకుడు ఫణి.. బెల్లంకొండ గణేష్ హీరోగా సినిమా చేయబోతున్నాడని సమాచారం.

మరో నాలుగు రోజుల్లో సినిమాను ప్రారంభించబోతున్నారట. తన రెండో కొడుకు కోసం స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేయబోతున్నాడు బెల్లంకొండ సురేష్. మరి హీరోగా గణేష్ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి!