టాలీవుడ్ సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ అనుకున్నట్టుగానే తన వారసులకు వెండితెరపై ఒక మార్గాన్ని సెట్ చేస్తున్నాడు. పెద్ద కుమారుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ ను అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ప్రజెంట్ చేశాడు. మాస్ ఆడియెన్స్ లో ఈ కుర్ర హీరోకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. 

ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రాగానే బాలీవుడ్ లో కూడా ఈ హీరోని పరిచయం చేయబోతున్నాడు. అసలు విషయంలోకి వస్తే చిన్న కుమారుడైన బెల్లంకొండ గణేష్ ని కూడా హీరోగా పరిచయం చేయడానికి ఈ సీనియర్ నిర్మాత సన్నాహకాలు చేస్తున్నారు. మొన్నటివారైకు కాస్త లావుగా కనిపించిన గణేష్ అసలు సినిమాల్లోకి వస్తాడా రాడా? అనే సందేహాలు వచ్చాయి. అతనికి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. 

కానీ ఇప్పుడు సురేష్ చిన్నోడిని కూడా గ్రాండ్ గా ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా కోసం డ్యాన్స్ లు అలాగే యాక్టింగ్ కోర్సులు కూడా పూర్తి చేసి ఫిట్ గా అయ్యాడు. చూస్తుంటే లవర్ బాయ్ కథలకు పర్ఫెక్ట్ గా సెట్టవుతాడని టాక్ వస్తోంది. మరి తండ్రి ఆలోచన ఏ విధంగా ఉందొ తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.