Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో గాయత్రి, చందు కి పదేపదే ఫోన్ చేస్తుండగా ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తులసి కస్టమర్ తో ఇలా నడుచుకోవాలి ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఇలా ప్రతి ఒక్కటి జాగ్రత్తలు చెబుతూ ఉండగా గాయత్రి పదేపదే కాల్ చేస్తూ ఉండడంతో కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తులసి అర్జెంట్ కాల్ ఉన్నట్టుంది. లిఫ్ట్ చేసి మాట్లాడండి అనడంతో అతను పక్కకు వెళ్లి చెప్పండి మేడం అనడంతో ఏంటి నా ఫోన్ కట్ చేస్తున్నావు మన డీల్ మర్చిపోయావా ఎలా అయినా నువ్వు ఆ కేఫ్ మూయించాలి. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అందుకు నీకు డబ్బులు బోనస్ ఇస్తాను అంటుంది గాయత్రి. ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి ఎవరు అండి ఫోన్ లో అంత టెన్షన్ గా మాట్లాడుతున్నారు అనడంతో అతను టెన్షన్ పడుతూ ఉంటాడు.

అప్పుడు అతడు అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత నందు కోసం రగిలిపోతుండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి నువ్వేమైనా దీక్ష చేసుకొని కూర్చున్నావా నేను చెప్పిన ప్రతి ఒక్కదానికి నో అని అంటున్నావు అలా ఏమైనా ఉంటే చెప్పు నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చుంటాను అని అంటుంది లాస్య. ఇది కేఫ్ గట్టిగా అడగకు అనడంతో అక్కడికేదో ఇంట్లో నన్ను మాట్లాడించినట్టు, అయినా నేను ఎంతగానో వెతికి ఒక మంచి చెఫ్ ని రప్పిస్తే వద్దని చెబుతావా నా ఆలోచనలకు విలువ ఇవ్వవా అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య మాటలకు నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

మరొకవైపు అభి బాధపడుతూ కూర్చుంటాడు. ఇంతలో అంకిత తన నగలను తీసుకొని వచ్చి అభికి ఇవ్వడంతో ఎందుకు ఇవి అని అనగా నగలు కేవలం అలంకరణ కోసమే మాత్రమే కాదు అవసరాలకు కూడా పనికొస్తాయి. వీసా కోసం, అమెరికాకు వెళ్లడానికి డబ్బులు కావాలి కదా అందుకే అని అంటుంది అంకిత. అప్పుడు అభి ఎమోషనల్ అవుతుండగా ఏమైంది అభి అని అనడంతో ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా బాధపెట్టాను లాగి ఒకటి చెంప కొట్టినా కూడా నేను బాధపడను అంకిత అని అంటాడు అభి. ఈ నగలు నాకొద్దు అంకిత ఇవి నీ నగలే నీ దగ్గర దాచుకో అని అనడంతో భార్యాభర్తల మధ్య నీ,నా అని ఉండదు అంటుంది అంకిత. నువ్వు ఎన్నైనా చెప్పు అంకిత ఈ నగలను తీసుకోవడం అంటే నా చేతకానితనాన్ని ఒప్పుకోవడమే అవుతుంది అంటాడు అభి.

 నిన్ను అమెరికాకు తీసుకెళ్తానని మాట ఇచ్చాను నా సొంత డబ్బులతో తీసుకెళ్తాను. దయచేసి నన్ను కష్టపడనివ్వు అని అంటాడు అభి. జాగ్రత్తలు నేను ఉన్నాను ఎడ్యుకేషన్ లోన్ కి కూడా అప్లై చేశాను ఒకవైపు చదువుకుంటూనే జాబ్ చేస్తూ డబ్బులు తిరిగి కట్టేద్దాము అని అంటాడు. అప్పుడు అభి మారిపోవడంతో అంకిత చూసావా అభి నేను ఇన్ని రోజులు ఏదానికోసమైతే ఎదురు చూశానో అది ఇప్పుడు నాకు దగ్గర అయింది అని సంతోషంగా మాట్లాడుతుంది. అప్పుడు అంకిత నా అభి మారిపోయాడు. నేను అనుకున్నట్టుగా నా అభి నన్ను ప్రేమిస్తున్నాడు. ఇష్టపడుతున్నాడు నా కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు అని ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది అంకిత. నేను నీతో పాటు ఎక్కడికి అని అడగను ఎంత దూరమైనా వస్తాను అంటుంది.

అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకుని బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్, నందు ఇద్దరు కలిసి పూలు అలంకరిస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ పూజ హడావిడి చేస్తూ ఉండగా ఇంతలో అభి అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్ తులసి సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనసూయ ప్రేమ్ మీద సెటైర్లు వేస్తుంది. అప్పుడు తులసి అభి పూజకి ఉమ్మెత్త పూలు తీసుకుని రమ్మని చెప్పావు తెచ్చావా అనడంతో మీ అబ్బాయికి పెళ్ళానికి పూలు తీసుకొని రావడమే తెలియదు ఇంకా దేవుడికి పూజలు తీసుకొస్తాడా అని అంటుంది అంకిత. అప్పుడు అంకిత సైలెంట్ గా ఉండు అనడంతో అంకిత మాత్రం అభి గురించి బయటికి అన్ని విషయాలు చెబుతూ ఉంటుంది.

అప్పుడు అందరూ సరదాగా సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి తాతయ్య లేదంటే సంగతులు. రేపటి నుంచి చూడు నా పెళ్ళాన్ని నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాను అనడంతో శృతి, ప్రేమ్ నీ కొట్టడానికి వెళ్ళగా ప్రేమ్ అక్కడి నుంచి పరుగులు తీయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గాయత్రి చందుకి ఫోన్ చేసి ఈరోజు ఆ కేఫ్ కి ఫుడ్ ఇన్ఫెక్టర్లు వస్తారు. ఎలా అయినా ఈరోజు ఆ కేఫ్ మూయించాలి అంటూ సరికొత్త ప్లాన్ వేస్తుంది అందుకే గాయత్రి. మరొకవైపు ఇంట్లో తులసి ఇంట్లో శివునికి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు అందరు సంతోషపడుతూ ఉంటారు.