చిత్ర పరిశ్రమలో వేధింపులు, అవహేళనలు ఎలా ఉంటాయో ఒక్కో నటి వెలుగులోకి వచ్చి ధైర్యంగా చెబుతుంటేనే ప్రపంచానికి తెలుస్తోంది. ఇటీవల నటీమణులు చిత్ర పరిశ్రమలో వేధింపులని అసలు సహించడం లేదు.
చిత్ర పరిశ్రమలో వేధింపులు, అవహేళనలు ఎలా ఉంటాయో ఒక్కో నటి వెలుగులోకి వచ్చి ధైర్యంగా చెబుతుంటేనే ప్రపంచానికి తెలుస్తోంది. ఇటీవల నటీమణులు చిత్ర పరిశ్రమలో వేధింపులని అసలు సహించడం లేదు. ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. తాజాగా యువ నటి అంజలి ఆనంద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అలియా భట్, రణ్వీర్ సింగ్ జంటగా నటించిన 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లు దిశగా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అంజలి ఆనంద్ రణ్వీర్ సింగ్ సోదరిగా గాయత్రీ పాత్రలో నటించి మెప్పించింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
తాను బాలీవుడ్ లోకి వచ్చినప్పటికీ నుంచి బాడీ షేమింగ్ కి గురయ్యానని తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది. తన బరువుని అందరూ అవహేళన చేసేవారు. నీలాంటి అమ్మాయికి మంచి పాత్రలు రావు. పక్కన కూర్చుని బర్గర్లు తినే అనవసరమైన పాత్రలు మాత్రం రావచ్చు అంటూ హేళనగా మాట్లాడారు. కానీ టివి షోలు చేసి ఇప్పుడు అంజలి ఆనంద్ రణ్వీర్ సింగ్, అలియా లాంటి స్టార్స్ నటించే చిత్రాల్లో ఛాన్సులు అందుకుంటోంది.
అంతకు ముందు కూడా కుల్ఫీ కుమార్ భజేవాలా లాంటి చిత్రాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ సమయంలో అంజలి ఆనంద్ కి ఇంత పాత్ర ఎలా వచ్చింది.. బహుశా ఆమె ఎవరితో అయినా కమిటై ఉంటుంది అంటూ దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి కూర్తుచేసుకుంది. అలాంటి మూర్ఖులకు సమాధానం చెప్పడం కూడా అనవసరం అని ఆ సమయంలో సైలెంట్ గా ఉన్నట్లు అంజలి గుర్తు చేసుకుంది.
