కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, అనీషా రెడ్డిల నిశ్చితార్ధం జరిగి చాలా కాలమవుతోంది. అక్టోబర్ లో పెళ్లి చేయడానికి ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించారు. కానీ వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అనీషా తన సోషల్ మీడియా ఖాతాలనుండి ఎంగేజ్మెంట్ ఫోటోలను తొలగించింది.

మరోవైపు విశాల్ కూడా తను పిన్ పెట్టిన పోస్ట్ ని డిలీట్ చేశాడు. దీంతో వీరి వివాహం రద్దయిందని అటు కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ జంట ఆ వార్తలపై స్పందించలేదు.

ఇక బ్రేకప్ జరిగిందనీ అందరూ ఫిక్స్ అయిన సమయంలో అనీషా మరో షాక్ ఇచ్చింది. నిన్న విశాల్ పుట్టినరోజు సందర్భంగా.. అతడికి విషెస్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ ఫోటో పెట్టి విశాల్ కోసం మెసేజ్ రాసింది..

''హ్యాపీ బర్త్ డే స్టార్.. నిన్ను ఎప్పటికీ ఆరాదిస్తూనే ఉంటాను.. నీ దిశగా గొప్పదనం రాబోతుంది.. నాకు నమ్మకం ఉంది.. లవ్ ఆల్వేస్'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారికి కన్ఫ్యూజన్ నెలకొంది. నిజంగానే అనీషా, విశాల్ లకు గొడవ జరిగితే ఆమె ఇంత గొప్పగా విషెస్ ఎలా చెబుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆమె అకౌంట్ నుండే షేర్ అయిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఇది అనీషా షేర్ చేసిన పోస్టా.. లేక ఎవరైనా చేసినా అల్లరా..? అనే విషయం  తెలియాల్సివుంది!