Asianet News TeluguAsianet News Telugu

అందరిని పక్కన పెట్టి ఎన్టీఆర్ కోసం అతడు.. రూ.4.5 కోట్ల రెమ్యునరేషన్ ?

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

Anirudh to compose music for NTR koratala movie
Author
Hyderabad, First Published Aug 13, 2021, 6:35 PM IST

కరోనా పరిస్థితులు వల్ల థియేటర్స్ లో సినిమా రిలీజ్ కావడమే కష్టంగా మారుతోంది. టాలీవుడ్ లో రిలీజ్ కు రెడీగా ఉన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. అప్పటికి పరిస్థితులు చక్కబడతాయనే హోప్ తో నిర్మాతలు ముందుకు వెళుతున్నారు. స్టార్ హీరోలు కొత్త చిత్రాలని కూడా ప్రారంభిస్తున్నారు. 

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళ దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ అవుతుంది అంటూ ప్రకటించినప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ మరో క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. 

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అనే వార్తలు వస్తుండగా.. తాజాగా ఆసక్తికర ప్రచారం జోరందుకుంది. 

తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైనట్లు టాక్. అనిరుద్ ని కొరటాల ఫైనల్ చేశారట. అయితే అనిరుద్ ఊహించని విధంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 4.5 కోట్ల పారితోషికం అడిగాడట. అనిరుద్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 

అనిరుద్ కంటే ముందుగా తమన్, మణిశర్మ, దేవిశ్రీ లాంటి స్టార్ డైరెక్టర్స్ పేర్లను కొరటాల పరిశీలించారట. చివరకు అనిరుద్ వైపే మొగ్గు చూపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios