ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. 

ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకు టెక్నీషియన్స్ ని ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. ఫామ్ లో ఉన్నవాళ్లకే ప్రయారిటీ ఇస్తూంటారు. తాజాగా ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ హిట్ కాంబో చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిందే అవకాసం ఉందిట. ఇంతకు ముందు ఓసారి ఎన్టీఆర్‌ చిత్రానికి అవకాశం అతనికి వచ్చినట్టే వచ్చి చేజారింది. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి తొలుత సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను అనుకున్నారు. అయితే, తర్వాత ఆ ఆఫర్ తమన్‌కు వెళ్లింది. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్‌30కి పని చేసే ఛాన్స్‌ అనిరుధ్‌ అందుకున్నారని సమాచారం. అనిరుథ్ అయితే బావుంటుందని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

దక్షిణాదిన నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ సెన్సేషన్ గా పేరుగాంచిన అనిరుధ్ రవిచందర్ తో పని చెయ్యాలని ఫ్యాన్స్ కోరిక కూడా. అయితే అది ఇప్పటిదాకా నెరవేరలేదు. ఈ సినిమాతో నెరవేరుతుందంటున్నారు. అనిరుథ్ ఇప్పటివరకు అజ్ఞాతవాసి, ‘గ్యాంగ్ లీడర్’, ‘జెర్సీ’ వంటి తెలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. నాని నటించిన ‘జెర్సీ’ చిత్రంలో ఆయన సంగీతాన్నిబాగుందన్నారు. కానీ అనిరుథ్ కు ఇంకా తెలుగులో పెద్ద కమర్షియల్ సక్సెస్ పడలేదు. దాంతో ఈ సినిమా అయితే అయినా అది నెరవేరుతుందని భావిస్తున్నారు. 

ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అలాగే కొరటాల దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. యువసుధ ఆర్ట్స్‌, నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.