సారాంశం
`యానిమల్` సినిమాతో యానిమల్ మూవీలో తన మార్క్ ఫిల్మ్ మేకింగ్ ని చూపించారు సందీప్ రెడ్డి వంగా. అయితే ఈ మూవీలో పార్ట్ 2పై క్లారిటీ ఇచ్చారు. టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.
సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన `యానిమల్` మూవీ తాజాగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య శుక్రవారం ఈ మూవీ థియేటర్లకు వచ్చింది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా ఇందులో జంటగా నటించడం విశేషం. ఈ మూవీ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుంది. సందీప్.. `అర్జున్‌రెడ్డి` తరహాలోనే హీరో క్యారెక్టర్ ప్రధానంగా ఈ మూవీని రూపొందించారు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమని, తండ్రి ప్రేమ కోసం కొడుకు పడే తపనని ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఫిల్మ్ మేకింగ్‌లో కొత్త స్టయిల్‌ని ఇందులో చూపించారు సందీప్. తాను ఇలానే తీస్తానని గర్వంగా, యాటిట్యూడ్‌తో చెప్పినట్టుగా ఈ మూవీ ఉండటం విశేషం. హీరో యాటిట్యూడ్, ఆరోగెన్సీ, అగ్రెషన్ ఇవన్నీ, బోల్డ్ నెస్ తో ఈ మూవీ మొత్తం రన్ అవుతుంది. వాయిలెన్స్ కూడా ఓవర్ డోస్‌లోనే ఉంటుంది. ఇలాంటి యాటిట్యూడ్‌ని ఇష్టపడేవారికి, యాక్షన్‌ని ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. యూత్‌కి, మాస్ ఆడియెన్స్ కి సైతం నచ్చుతుంది. అయితే బీసీ సెంటర్ ఆడియెన్స్ కి ఏ మేరకు రీచ్ అవుతుందనేది చూడాలి. ఎందుకంటే సినిమా మొత్తం రిచ్ ఫ్యామిలీలో జరిగే కథ. దీనికితోడు డైలాగులు చాలా వరకు ఇంగ్లీష్, హిందీ లాంటి లాంగ్వేజెస్‌లో ఉంటాయి. సాధారణ ఆడియెన్స్ కి కొంత అర్థం కాని విధంగా ఉంటాయి.
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే మూడున్నర గంటల సినిమా తీసి షాకిచ్చారు సందీప్‌రెడ్డి వంగా. అయితే సినిమా చివర్లో ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. `విక్రమ్` తరహాలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ పెట్టి పార్ట్ 2 ని అనౌన్స్ చేశారు. `యానిమల్ పార్క్` అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ మూవీలో హీరో పాత్రని యానిమల్ లా చూపించారు. ఇక యానిమల్ పార్క్ అంటే అది ఇంకా ఏ రేంజ్ మ్యాడ్‌నెస్, బోల్డ్ నెస్, వాయిలెంట్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. చివర్లో చూపించిన పాత్ర సైతం క్రేజీగా అనిపించడం విశేషం. త్వరలోనే ఈ రెండో పార్ట్ ని కూడా థియేటర్లోకి తీసుకురాబోతున్నట్టు చెప్పారు.
మరి ఈ సినిమాని ఎప్పుడు తీస్తారు, ప్రభాస్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు? అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు ఉంటుంది? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కానీ `యానిమల్` మూవీ మాత్రం జనాలకు కనెక్ట్ అయితే నెక్ట్స్ లెవల్ హిట్ అవుతుంది. వెయ్యి కోట్లు దాటిపోయే సినిమా అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.