ఏజెంట్ మూవీ నష్టాల ఎఫెక్ట్..కోర్టు కేసులకు భయపడను, అనిల్ సుంకర స్ట్రాంగ్ రియాక్షన్
నిర్మాత అనిల్ సుంకర పేరు గత ఏడాది ఎక్కువగా వినిపించింది. పాజిటివ్ గా అయితే కాదు. లాస్ట్ ఇయర్ ఆయనకి ఏమాత్రం కలసి రాలేదు. అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.
నిర్మాత అనిల్ సుంకర పేరు గత ఏడాది ఎక్కువగా వినిపించింది. పాజిటివ్ గా అయితే కాదు. లాస్ట్ ఇయర్ ఆయనకి ఏమాత్రం కలసి రాలేదు. అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్ లో వచ్చిన ఏజెంట్ చిత్రం ఊహించని దెబ్బ కొట్టింది.
80 నుంచి 100 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా రాబట్టలేదు. 10 శాతం కలెక్షన్లు కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం నేడు థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.
అయితే ఈ చిత్ర రిలీజ్ అడ్డుకునేందుకు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ ప్రయత్నించారు. కోర్టులో ఫిటిషన్ వేసారు. అయితే ఊరు పేరు భైరవ కోన చిత్రాన్ని అడ్డుకోవాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. గతంలో సతీష్ ఏజెంట్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ మూవీ దారుణమైన ఫ్లాప్ కారణంగా సతీష్ భారీ నష్టపోయారు. ఈ వివాదంతో ఊరు పేరు భైరవకోన చిత్రంపై కోర్టుకు వెళ్లారు.
దీనిపై అనిల్ సుంకర మాట్లాడుతూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. నన్ను న్యాయపరమైన సమస్యలతో ఇబ్బంది పెట్టగలరేమో కానీ భయపెట్టలేరు. నేను ఇలాంటి కేసులకు భయపడను. నిర్మాతగా నేను కూడా నష్టపోయాను. నేను ఎవ్వరికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే నేను ఏదైనా మంచి చేయొచ్చు.
ఇలా కోర్టులకెక్కి కేసులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. లాయర్లకు ఫీజులు దండగ. అది ఇద్దరికీ అదనపు భారం అవుతుంది. ఈ వివాదంలో అంతా నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇది సరైంది కాదు. వ్యాపారాలు అన్నాక లాభాలు నష్టాలు సహజం. సతీష్ పై నాకు ఎలాంటి కోపం, ద్వేషం లేదు. కానీ ఇలా కేసుల వల్ల ఉపయోగం లేదు అని చెబుతున్నా. భవిష్యత్తులో ఏదైనా సహాయం చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అనిల్ సుంకర అన్నారు.