వరుసగా విజయాలు అందుకుంటోన్న దర్శకుడు అనీల్ రావిపూడి రీసెంట్ గా 'ఎఫ్ 2' చిత్రంతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అతడికి మార్కెట్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. 

అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలు కడుతున్నారు. అయితే ఇప్పటివరకు అనిల్ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అనీల్ చేయబోయే తదుపరి సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది.

గతంలో నానితో ఒక సినిమా చేసిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఈ కథతో పాటు, బాలయ్య కోసం కూడా కథ సిద్ధం చేసుకున్నాడు. అయితే ముందుగా లేడీ ఓరియెంటెడ్ కథను తెరకెక్కించనున్నాడు.

ప్రస్తుతం కథకు తగ్గ హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఈ సినిమా తరువాత బాలయ్య సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఆ తరువాత మళ్లీ దిల్ రాజు ప్రొడక్షన్ లో అనీల్ సినిమా చేస్తాడని అంటున్నారు.