అల్లరి నరేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సుడిగాడు సినిమా.. ప్రతీ ఒక్కిరినికడుపుబ్బా నవ్వించిన ఈసినిమాకు సీక్వెల్ వస్తే..? ప్రస్తుతం టాలీవుడ్ లో అదే టాపిక్ నడుస్తోంది. 

టాలీవుడ్ లో వరుసగా 50 కామెడీ సినిమలు చేసిన రికార్డ్ అల్లరి నరేష్ కు మాత్రమే సొంతం. జయాపజయాలు చూడకుండా.. ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకుని.. కామెడీలో కూడా హీరోయిజం చూపిస్తూ.. సినిమాలు చేస్తూ వెల్లాడు నరేష్. అల్లరి సినిమాతో ప్రస్తానం స్టార్ట్ చేసి.. అల్లరి నరేష్ గా మారిపోయిన ఈవీవీ తనయుడు.. ఆతరువాత సినిమాలు లేక అల్లాడిపోయాడు. ప్రేక్షకుల అభిరుచి మారిందని గ్రహించిన ఆయన .. తాజాగా తన రూటు మార్కి.. కాస్త సీరియస్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. 

కొన్నాళ్ళు కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి సీరియస్, ఎమోషనల్, మాస్ సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యాడు అల్లరి నరేష్. అందులో భాగంగానే నాంది సినిమాతో ..తనలో మార్పుకు నాంది పలికి.. సక్సెస్ సాధించాడు. ఆతరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం సినిమాతో.. ఇంకాస్త కొత్తదనం చూపించాడు. ఈసినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ప్రస్తుతం తన నాంది దర్శకుడితెనే ఉగ్రం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఫుల్ మాస్, పవర్ ఫుల్, యాక్షన్ రోల్ లో అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది.

ఇక ఈసినిమా ప్రమోషన్లలో మూవీ టీమ్ పుల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు.. ప్రమోషనల్ ఈవెంట్లతో తెగ హడావిడి చేస్తున్నారు టీమ్. ఈక్రమంలోనే.. అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూల్ పాల్గోనగా.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. సీక్వెల్ సినిమాల గురించి టాపిక్ రావడంతో.. అల్లరోడు మాట్లాడుతూ.. నా సినిమాల్లో సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీయొచ్చు అన్నారు. అంతే కాదు అప్పట్లోఈ సినిమాకు ఇప్పటి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పనిచేశారని.. తాజాగా అనిల్ రావిపూడిని కలిశాను అన్నారు. అతనే సుడిగాడు 2 తీద్దామా అని అడిగాడు. నేను రూటు మార్చితే మళ్ళీ కామెడీ వైపు తీసుకెళ్తారా అని అడిగితే ఆయన ఓకే అన్నాడు అని తెలిపారు. 

దీంతో అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్.. నరేష్ తో నిజంగా సుడిగాడు 2 చేస్తాడా అని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. ప్రస్తుతం నరేష్ చేస్తున్న సీరియస్ క్యారెక్టర్లు బాగా వర్కౌట్ అవుతుండటంతో.. ఆయన ఈ రూటు ఇప్పట్లో మార్చే ఆలోచన ఉంటుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో 108 మూవీ చేస్తున్నాడు.