ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరల వివాదం ఇంకా కొనసాగుతుంది. సినిమా టికెట్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సచివాలయం రెండో బ్లాక్‌లో సమావేశమైన కమిటీ.. పలు అంశాలపై చర్చించింది.

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరల వివాదం ఇంకా కొనసాగుతుంది. సినిమా టికెట్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సచివాలయం రెండో బ్లాక్‌లో సమావేశమైన కమిటీ.. పలు అంశాలపై చర్చించింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో కమిటీలో సభ్యులుగా ఉన్న పలు విభాగాల ఉన్నతాధికారులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు, థియేటర్ యజానులు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. టికెట్ల ధరలు ఎంత పెంచాలనే అంశంపై కమిటీ సభ్యులు ప్రధానంగా చర్చించారు. 

ఈ సమావేశం అనంతరం తెలుగు ఫిలిం చాంబర్ వైఎస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ, ప్రజలు బాగుండాలనే అంతా భావిస్తామని చెప్పారు. టికెట్ల రేట్లపై సానుకూల నిర్ణయం వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్ అసోషియేషన్ తరఫున టికెట్ ధరల పెంచాలని అడిగామని చెప్పారు. త్వరలోనే టికెట్ల ధరలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కమిటీలో అధ్యయనం చేశాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. టికెట్ల ధరల నిర్ణయానికి స్లాబులపై చర్చించినట్టుగా చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరలపై 10 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. థియేటర్లలో ఐదో షో అనుమతిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. 

కమిటీ సమావేశం మరోసారి ఉండొచ్చు.. ఉండకపోవచ్చని అన్నారు. ధరల నిర్ణయానికి థియేటర్లలో మూడు స్లాబులు ఉంటాయి. అందులో మార్పులు ఉండే అవకాశం లేదని.. దీనిపై నేడు నిర్దిష్టమైన చర్చ సాగిందని చెప్పారు.