కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. దీంతో చలించిపోయిన యాంకర్‌ సుమ  సీరియస్‌గా ఓ ఎమోషనల్‌ నోట్‌ ని పంచుకుంది. సోషల్‌ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో సుమ చెబుతూ, కరోనా వల్ల చిత్ర పరివ్రమ ఆగిపోయిందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించింది. మేకప్‌ కిట్లు బూజుపట్టిపోతున్నాయంటూ ఆమె మేకప్‌ వేసుకుంటూ ఆ వీడియోని షేర్‌ చేసింది. 

ఈ సందర్భంగా సుమ చెబుతూ, `ఈ వీడియోను సరదాగా చూడండి. నోట్‌ మాత్రం కాస్త సీరియస్‌గానే చదవండి. వినోద పరిశ్రమలో మేం శారీరకంగా పనిచేయాల్సి ఉంటుంది. మాకు తిండిపెట్టేది అదే. అంటే నటీనటులు, యాంకర్స్, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, కెమెరామెన్, లైట్ మెన్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్, మేకప్, హెయిర్‌స్టైలిస్ట్, ఆర్ట్, ఫుడ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విభాగాలు సినిమా సెట్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారంతా ఇప్పుడు ఖాళీ ఉంటున్నారు. మళ్లీ పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల కుటుంబాలకు తిండి పెట్టాలని వెయిట్‌ చేస్తున్నారు. త్వరలోనూ మళ్లీ ఇండస్ట్రీ పనులు మొదలవుతాయని భావిస్తున్నా` అని సుమ పేర్కొంది. ఇప్పుడీ పోస్ట్ అందరిని కదిలిస్తుంది. 

సుమ టీవీ యాంకర్స్ లో అత్యంత బిజీగా ఉండే యాంకర్. ఈటీవీ, స్టార్‌ మా, జీ తెలుగు, జెమినీ ఇలా దాన్ని అన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్ లోనూ ఆమె షోస్‌ చేస్తుంది. అంతేకాదు సినిమా ఈవెంట్లకి కూడా ఆమె యాంకర్‌. ఇలా రోజు మొత్తం బిజీగా ఉండే సుమ ఇప్పుడు షూటింగ్‌లు లేక ఖాళీగా ఉందట. అయితే కొన్ని పోగ్రామ్స్ మాత్రం సైలెంట్‌గా షూట్‌ చేస్తున్నారని టాక్‌.