బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో అతిపెద్ద సంచలనానికి తెరలేపారు నిర్వాహకులు. స్టార్ యాంకర్ సుమ కనకాలను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. ఈ విషయాన్ని ఇప్పటికీ కొందరు ప్రేక్షకులు నమ్మడం లేదు. ఎపిసోడ్ కోసం ప్రమోషనల్ స్టంట్ అనుకుంటున్నారు. దానికి కారణం స్టార్ యాంకర్ గా సూపర్ పాపులారిటీ ఉన్న సుమ చేతిలో అనేక టీవీ షోలు ఉన్నాయి. చేతినిండా షూటింగ్స్ తో రెండు చేతులా సంపాదించే యాంకర్ సుమ, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అనేది నిజంగా ఊహించని పరిణామమే. 

ఇది సాధ్యమైనట్లు నాగార్జున తాజా ప్రోమోలో చూపించడం జరిగింది. లగేజీతో దిగిపోయిన సుమ, ఇంటిలోకి కూడా వెళ్లినట్లు ఆ ప్రోమోలో ఉంది. గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే ప్రస్తుత సీజన్ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. కేవలం సింగిల్ డిజిట్ టీఆర్పీకి బిగ్ బాస్ పరిమితం అవుతుందని సమాచారం. బిగ్ బాస్ ఓటింగ్ పై నెగెటివ్ ప్రచారం, హౌస్ మేట్స్ అంత ఫేమ్ కలిగినవారు కాకపోవడం షో టీఆర్పీని దెబ్బగొడుతున్నాయి.
 
ఇక నష్టనివారణ చర్యలలో భాగంగా బిగ్ బాస్ యాంకర్ సుమను హౌస్ లోకి పంపించి ఉండే అవకాశం కలదు. ఈ క్రమంలో సుమ డిమాండ్ రీత్యా, ఆమెకు లక్షలు కుమ్మరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఒంటి చేత్తో వేడుకైనా, షో అయినా రక్తికట్టించే సుమకు వారాని ఎన్ని లక్షలు ఇస్తానేది హాట్ టాపిక్ గా మారింది. సుమకు భారీగా ఇచ్చి అంగీకారం కుదుర్చుకోని  హౌస్ లోకి తెచ్చారనే టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లో ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ తీసుకోని రెమ్యూనరేషన్ సుమ తీసుకోవడం మాత్రం ఖాయం అంటున్నారు.