నటిగా రాణించి, మంచి మార్కులు వేసుకున్న సుమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకరింగ్‌పై స్పందించింది. నటిగా రాణిస్తున్న క్రమంలో యాంకరింగ్‌ మానేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. 

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది సుమ కనకాల (Suma Kanakala). స్టార్‌ యాంకర్‌గానే కాదు, అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్‌గానూ, అత్యంత బిజీ యాంకర్‌గానూ రాణిస్తుంది సుమ. ఆమె ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు సినిమా ఈవెంట్లు, మరోవైపు ఇంటర్వ్యూలు, ఇంకోవైపు తన యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం వీడియోలు. ఇలా క్షణం తీరికలేకుండా ఉండే ఆమె ఇవి సరిపోవని మరోసారి నటిగానూ మారింది. 

యాంకర్‌ సుమ(Anchor Suma ప్రస్తుతం చాలా గ్యాప్‌తో మరోసారి నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె `జయమ్మ పంచాయతీ` (Jayamma Panchayathi) చిత్రంలో నటించింది. విజయ్‌ కలివారపు దర్శకత్వం వహించిన ఈసినిమా శుక్రవారం విడుదలైంది. దీనికి మిక్డ్స్ డ్‌ టాక్‌ వస్తోంది. ఆమె అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే నటిగా రాణించి, మంచి మార్కులు వేసుకున్న సుమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకరింగ్‌పై స్పందించింది. నటిగా రాణిస్తున్న క్రమంలో యాంకరింగ్‌ మానేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. 

దీనిపై సుమ కనకాల స్పందించారు. తాను ఇకపై కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పింది. నటన కొనసాగిస్తానని స్పష్టం చేసింది. అయితే యాంకరింగ్‌ (Suma Anchoring) కూడా వదిలే ప్రసక్తి లేదని వెల్లడించింది. ఆ విషయంలో తగ్గేదెలే అంటోంది. టీవీ షోస్‌ని, యాంకరింగ్‌ని వదిలేది లేదని చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని చెప్పింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని తేల్చి చెప్పింది సుమ. దీంతో ఇకపై సినిమాలు, టీవీ షోస్‌, ఈవెంట్లతో మరింత బిజీగా కాబోతుందని చెప్పొచ్చు. ఇక తాజాగా విడుదలైన `జయమ్మ పంచాయితీ`లో జయమ్మ పాత్రలో కనిపించింది సుమ. తనదైన నటనతో మెప్పించింది. సినిమాని తన భుజాన వేసుకుని నడిపించి అదరగొడుతుంది సుమ. 

మరోవైపు తన కుమారుడు రోషన్‌ సినిమా ఎంట్రీపై స్పందించింది యాంకర్‌ సుమ. ఈ ఏడాదిలోనే తనని హీరోగా లాంచ్‌ చేయబోతున్నట్టు చెప్పింది. రోషన్‌కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే పిచ్చి అని చెప్పింది. హీరోగా గ్రాండ్‌గా లాంచ్‌ చేయబోతున్నట్టు చెప్పింది సుమ. మరోవైపు తాను సినిమాలు మానేయడానికి సంబంధించి చెబుతూ, తన కుమార్తె ఏడెనిమిదేళ్ల టైమ్‌లో వరుసగా షూటింగ్‌లతో బిజీగా ఉండి, పిల్లలతో టైమ్‌ కేటాయించలేకపోయింది. దీంతో వాళ్ల కూతురు `నిన్ను టీవీలోనే చూడాలా అమ్మా..` అని అడిగిందని, ఆ మాటకి తన గుండె పిండినంతపనైందని చెప్పింది సుమ.