చివరికి సుమ కూడా కుమారి ఆంటీలా మారిపోయిందిగా.. సుకుమార్ భార్య రెస్పాన్స్ చూస్తే, వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండింగ్ గా మారితే దానిని జనాలతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫాలో అవుతుంటారు. తాజాగా యాంకర్ సుమ సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ లాగా మారిపోయింది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీకి సంబందించిన ఫుడ్ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి మామూలు హైప్ రాలేదు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు రావడం.. తాత్కాలికంగా పోలీసులు కుమారి ఆంటీకి ఆంక్షలు విధించడం జరిగింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకు వెళ్లడం చూశాం.
అయితే సీఎం రేవంత్ రెడ్డి యథావిధిగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవచ్చు అని వెసులుబాటు కల్పించారు. దీనితో కుమారి ఆంటీ క్రేజ్ రెట్టింపు అయింది. ఎంతలా అంటే కుమారీ ఆంటీ 1000 రూపీస్ 2 లివర్లు ఎక్ట్రా అనే డైలాగుని డీజే మిక్స్ తో రీల్స్ చేసేస్తున్నారు.
చివరికి యాంకర్ సుమ కూడా కుమారి ఆంటీ క్రేజ్ కి అతీతం కాదు. సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అవుతున్నా జనాలతో పాటు సెలెబ్రిటీలు కూడా ఆగడం లేదు. కుమారి ఆంటీని ఫాలో అవుతూ యాంకర్ సుమ ఫన్నీగా వీడియో చేసింది. కుమారి ఆంటీ తరహాలో ఫుడ్ వడ్డిస్తూ.. రెండు లివర్ లు ఎక్స్ట్రా అంటూ సందడి చేసింది.
సుమ చేసిన ఈ ఫన్నీ ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమ వీడియోపై నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి యాంకరింగ్ మానేసి బిజినెస్ మొదలు పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. మధ్యలో బ్రహ్మాజీ కామెడీ కూడా ఉంది. అబ్బా ఏమి వాడకం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా యాంకర్ సుమ వీడియోపై సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ కూడా స్పందించారు. ఫన్నీ ఎమోజిలతో రియాక్షన్ ఇచ్చారు. కుమారి ఆంటీ ప్రభావం ఎంతలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే కుమారి ఆంటీని సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, మీడియాలో ఇంతలా హైలైట్ చేయడం పట్ల ఇతర ఫుడ్ స్టాల్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరినే ఇలా పాపులర్ చేస్తే తమ బిజినెస్ పరిస్థితి ఏంటి.. తాము వీధిన పడతాం అని గగ్గోలు పెడుతున్నారు.