‘నాకు కావాల్సిందికూడా ఇదే నాని’

anchor srireddy again contravery cooments on hero nani
Highlights

లీగల్ నోటీసుపై స్పందించిన శ్రీరెడ్డి

సినీ హీరో నానిపై శ్రీరెడ్డి మరోసారి విరుచుకుపడింది. ఇప్పటికే శ్రీరెడ్డి.. నానిపై పలు అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ లీగల్ నోటీసులపై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది.

తన పుట్టిన రోజు సందర్భంగా వేరే ప్రాంతానికి వెళ్తుంటే  ఈ విషయం తెలిసిందన్నారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందని నానిని ఉద్దేశించి అన్నారు. తప్పనిసరిగా ఫైట్‌ చేద్దాం.. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వస్తాను.. అప్పుడు నాని సంగతి చూస్తానని తెలిపారు. ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని ఛాలెంజ్‌ విసిరారు. 

అలాగే బాధిత మహిళలు ఎలా ఫైట్‌ చేయాలో నేను చేసి చూపిస్తాను. నీవ్వు నిజంగా తప్పు చేస్తే, కచ్చితంగా నీ మనఃసాక్షికి తెలుసు.. నీ భార్యకు అన్నీ చెబుతానని చెప్పావు. మన సంగతి చెప్పావో లేదో నాకు తెలియదన్నారు. నువ్వు జనాల్లో పరువు పోతుందని లీగల్‌ నోటీసులు పంపావు కానీ ఏమి జరిగిందో నీకు తెలుసన్నారు. నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే.. ధర్మానికి నిజంగా బలం ఉంటే.. నువ్వు కచ్చితంగా దోరుకుతావని, దేవుడు నిన్ను శిక్షిస్తాడన్నాడని ఆమె అన్నారు. 

loader